సీనియర్ హీరో రాజశేఖర్.. జీవితలపై ఇటీవలే సామాజిక కార్యకర్త సంధ్య సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. రాజశేఖర్ కోసం జీవిత అమ్మాయిలను బుట్టలో వేసి ఆయన దగ్గరకు పంపేదని.. ఇలా బలైన అమ్మాయిల గురించి తాను చాలా విన్నానని.. స్వయంగా ఇద్దరు అమ్మాయిల కేసుల్ని డీల్ చేశానని సంధ్య ఆరోపించింది. దీనిపై జీవిత ఘాటుగా స్పందించింది. ఈ ఆరోపణలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ లీగల్ చర్యలకు కూడా ఉపక్రమించింది. ఆ తర్వాత దీనిపై చర్చ ఆగిపోయింది. వ్యవహారం సద్దుమణిగింది. ఇప్పుడు సీనియర్ నటి.. వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రోజా ఈ ఆరోపణలపై స్పందించింది. ఆమె రాజశేఖర్ కుటుంబానికి మద్దతుగా నిలిచింది. సంధ్య చేసిన ఆరోపణలు అసంబద్ధమని ఆమె అంది.
తాను రాజశేఖర్ తో రెండు సినిమాల్లో నటించానని.. ఆయన తనతో కానీ.. మరెవరితో కానీ అసభ్యకరంగా ప్రవర్తించింది లేదని.. ఆయన అలాంటోడు కాదని ఒక టీవీ ఛానెల్ చర్చా కార్యక్రమంలో రోజా చెప్పింది. రాజశేఖర్ పూర్తిగా ఫ్యామిలీ పర్సన్ అని.. జీవిత లేకుండా బయటికి కూడా వెళ్లేవారు కాదని.. ఇప్పుడు ఆయన తన పిల్లలు లేకుండా కూడా బయటకు వెళ్లట్లేదని రోజా అంది. రాజశేఖర్ గురించి వచ్చిన ఆరోపణల్ని ఎవ్వరూ నమ్మే పరిస్థితి లేదని.. కావాలనే వేరే ఉద్దేశంతోనే ఆయన్ని లక్ష్యంగా చేసుకుని.. బురదజల్లేందుకే ఇలాంటి ఆరోపణలు చేశారని జనాలు అనుకుంటున్నారని రోజా అభిప్రాయపడింది. రాజశేఖర్ తన భర్తకు కూడా క్లోజ్ ఫ్రెండ్ అని రోజా చెప్పారు. రాజశేఖర్ నిజంగా అలాంటివేమైనా చేసి ఉంటే వెంటనే బయటకు వచ్చేదని.. లేదా కొంత కాలం తర్వాత అయినా బయటపడేదని.. అలాంటిదేమీ జరగలేదంటే ఆరోపణల్లో నిజం లేదనే భావించాలని రోజా స్పష్టం చేసింది.