'వర్షంలో వెన్నెల్లా'.. రొమాన్స్ తో రెచ్చిపోయిన శౌర్య..!

Update: 2022-04-09 06:43 GMT
నాగశౌర్య హీరోగా అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ''కృష్ణ వ్రింద విహారి''. ఐరా క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందిన ఈ సినిమాలో షెర్లీ సెటియా హీరోయిన్ గా నటించింది. పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉన్న ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.

మ్యూజికల్ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా 'కృష్ణ వ్రింద విహారి' సినిమాలోని ఫస్ట్ సింగిల్ ని మేకర్స్ ఆవిష్కరించారు. సౌత్ స్టార్ హీరోయిన్ సమంత శనివారం ఉదయం 'వర్షంలో వెన్నెల్లా' అనే పాటను విడుదల చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

'రా వెన్నెల్లో వర్షంలా.. రా వర్షంలా వెన్నెల్లా.. అందాలిలా అందాయిగా..' అంటూ సాగిన ఈ రొమాంటిక్ గీతం శ్రోతలను ఆకట్టుకుంటోంది. మహతి స్వర సాగర్ బ్యూటీఫుల్ ట్యూన్ కంపోజ్ చేయగా.. సంజన కల్మంజే మరియు ఆదిత్య ఆర్కే కలసి వినసొంపుగా ఆలపించారు. హీరోహీరోయిన్ల మధ్య భావాలను తెలియజేసేలా శ్రీమణి సాహిత్యం అందించారు.

ఇందులో ప్రేమలో మునిగి తేలుతున్న నాగ శౌర్య మరియు షిర్లీ సెటియా మధ్య ఉత్తమమైన కెమిస్ట్రీని చూడవచ్చు. 'వర్షంలో వెన్నెల్లా' పాట ఈ సంవత్సరపు రొమాంటిక్ సాంగ్ గా ఉండబోతోంది. విజువల్స్ ట్యూన్ కు తగ్గట్టుగా ఎంతో అందంగా, ఆకట్టుకునేలా ఉన్నాయి.

విభిన్నమైన రోమ్-కామ్ గా రూపొందించబడిన 'కృష్ణ వ్రింద విహారి' చిత్రంలో నాగ శౌర్య బ్రాహ్మణ యువకుడి పాత్రను పోషించారు. సీనియర్ నటి రాధిక శరత్ కుమార్ కీలక పాత్రలో నటించగా.. వెన్నెల కిషోర్ - రాహుల్ రామకృష్ణ - బ్రహ్మజీ - సత్య తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.

శంకర్ ప్రసాద్ మల్పూరి సమర్పణలో ఉషా మల్పూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. తమ్మిరాజు ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. రామ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ మరియు టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో లేటెస్టుగా వచ్చిన 'వర్షంలో వెన్నెల్లా' పాట ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. త్వరలోనే 'కృష్ణ వ్రింద విహారి' చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.


Full View
Tags:    

Similar News