ఆర్పీ పట్నాయక్ .. చాలాకాలం క్రితమే సినీ సంగీత ప్రపంచంలోకి ఆయన ఒక ఎగసిపడే కెరటంలా దూసుకు వచ్చాడు. 'చిత్రం' .. ' నువ్వు నేను' .. 'సంతోషం' .. 'జయం' సినిమాలు విజయాన్ని సాధించడంలో ఆయన సంగీతం ముఖ్యమైన పాత్రను పోషించింది. తను సంగీతాన్ని సమకూర్చిన పాటల్లో కొన్ని ఆయనే పాడాడు. సంగీత దర్శకుడిగా ఆయన కెరియర్ దూకుడుగా వెళుతూ ఉండగానే, హఠాత్తుగా ఆయన 'ఇకపై తాను సంగీతం చేయడం లేదు' అని ప్రకటించి అభిమానులను ఆశ్చర్యపరిచాడు.
తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. "నా సంగీతం గురించి ఎవరో ఒక పెద్దాయన వచ్చి ఒక మాట అన్నాడు. దాంతో నేను చాలా హర్ట్ అయ్యాను. ఇకపై సంగీతం చేయకూడదని అప్పుడే నిర్ణయించుకున్నాను. నేను సంగీత దర్శకుడిగా చేయనని చెప్పిన తరువాత, నా అభిమానులు నన్ను కొట్టడానికి కూడా వచ్చారు. కోటి గారు నాకు ఎంతో నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. ముఖ్యంగా నా స్నేహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అయితే సంగీతం మానుకోవద్దని చెబుతూ, ఒక పూట అంతా కూర్చుని మరీ నాకు క్లాస్ పీకాడు.
ఆ తరువాత బాలూ గారు కన్నడలో ఒక పాటల ప్రోగ్రామ్ చేస్తూ ఉండగా, నేను ట్యూన్ చేసిన సాంగ్ ఒకరు పాడారట. అప్పుడు ఆయన నా గురించి మాట్లాడుతూ, నేను సంగీతాన్ని పక్కన పెట్టడం బాధ కలిగించిందంటూ కనీళ్లు పెట్టుకున్నారట. ఆ విషయం తెలిసి నాకు అదోలా అనిపించింది. ఆ తరువాత నేను ఎక్కడ కనిపించినా 'ఇకనైనా మొదలు పెట్టావయ్యా ..' అని ఆయన చాలా ముద్దుగా అడిగేవారు. ఆయన చనిపోయిన తరువాత, ఆయన కోరిక తీర్చడం కోసం రీ ఎంట్రీ ఇస్తున్నాను" అని చెప్పుకొచ్చారు.