దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ ''ఆర్ ఆర్ ఆర్''. టాలీవుడ్ స్టార్ హీరోలైన యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. యావత్ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ట్రిపుల్ ఆర్ చిత్రం నుంచి గత కొంతకాలంగా రెగ్యులర్ అప్డేట్స్ వస్తున్నాయి. ఈ క్రమంలో ఇటీవల మేకర్స్ ఓ తీపి కబురు అందించారు. ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ను ఎలా చిత్రీకరించారో తెలియజేయడానికి ఓ సర్ప్రైజ్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. 'రోర్ ఆఫ్ RRR' పేరుతో మేకింగ్ వీడియోని జులై 15వ తేదీన ఉదయం 11 గంటలకి రిలీజ్ చేస్తున్నట్టు చిత్ర బృందం వెల్లడించింది.
అప్పటి నుంచి 'ఆర్.ఆర్.ఆర్' వీడియో ఎలా ఉండబోతుంది అని అందరిలో ఆసక్తి ఎక్కువైంది. జక్కన్న ఏ ప్రదేశాల్లో ఈ సినిమా షూటింగ్ జరిపాడు?.. దీని కోసం ఎలాంటి సెట్స్ రూపొందించారు?.. ఈ వీడియోలో హీరోల పాత్రలకు సంబంధించిన సన్నివేశాల్ని చూపిస్తారా?.. ఇలా అనేక విధాలుగా చర్చించుకుంటున్నారు. ఇప్పటి వరకు RRR నుంచి వచ్చిన ప్రతీ అప్డేట్ అంచనాలను అందుకుంది. రామ్ చరణ్ ఇంట్రో వీడియో 'భీమ్ ఫర్ రామరాజు' - ఎన్టీఆర్ ఇంట్రో వీడియో 'రామారాజు ఫర్ భీమ్' - ఇద్దరు హీరోహీరోయిన్ల ఫస్ట్ లుక్స్ మరియు ఇతర స్పెషల్ పోస్టర్స్ అన్నీ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో వస్తున్న మేకింగ్ వీడియో ఎలా ఉంటుందో చూడాలి.
'ఆర్.ఆర్.ఆర్' చిత్రం నుంచి ఇప్పటి వరకు ఎన్టీఆర్ - రామ్ చరణ్ లు కలిసి ఉన్న వీడియో ఒక్కటి కూడా వెలువడలేదు. అయితే మరో రెండు రోజుల్లో రాబోతున్న 'రోర్ ఆఫ్ ఆర్.ఆర్.ఆర్' లో ఇద్దరు కాంబోలో సీన్స్ కు సంబంధించిన మేకింగ్ చూపిస్తారేమో అని అభిమానులు ఆశ పడుతున్నారు. అంతేకాదు మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ని ఇటీవల ప్రముఖ ర్యాపర్ బ్లేజ్ కలవడంతో ఈ వీడియో కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు ఏమైనా చేస్తున్నారా? అని ఆలోచిస్తున్నారు. సినిమాని పబ్లిసిటీ చేయడంలో జక్కన్న ను మించిన మాస్టర్ మైండ్ లేదని అంటుంటారు. మరి ఈ వీడియోని ఎలా ప్లాన్ చేశారో చూడాలి.
కాగా, చరిత్రలో ఎన్నడూ కలవని, రెండు వేర్వేరు కాలాలకు చెందిన ఇద్దరు రియల్ లైఫ్ పోరాట యోధులు కొమురం భీమ్ - అల్లూరి సీతారామరాజు కలిసి పోరాడితే ఎలా ఉంటుందనే కల్పిత కథతో 'ఆర్ ఆర్ ఆర్' సినిమా రూపొందుతోంది. ఇందులో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్.. కొమురం భీమ్ గా తారక్ కనిపించనున్నారు. ఆలియా భట్ - ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్‌గణ్ - శ్రియ - సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. సెంథిల్ కుమార్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా పది భాషల్లో 'ఆర్ ఆర్ ఆర్' విడుదల కానుంది. రెండు పాటలు మినహా టాకీ పార్ట్ మొత్తం పూర్తయినట్టు ఇటీవల RRR టీమ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఆ రెండు సాంగ్స్ ని కూడా షూట్ చేయనున్నారు. తారక్ - చరణ్ ల కాంబోలో ఓ పాట.. చరణ్ - అలియా మధ్య ఓ పాట పెండింగ్ ఉన్నాయని సమాచారం. దసరా కానుకగా అక్టోబరు 13న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. మరి జక్కన్న అనుకున్న సమయానికి 'రౌద్రం రుధిరం రణం' చిత్రాన్ని కంప్లీట్ చేయగలడో లేదో చూడాలి.