RRR సంచలనాల గురించి కొత్త సంవత్సరంలో ఇప్పటికీ ముచ్చట సాగుతోంది. 1000 కోట్ల వసూళ్లనే కాదు అవార్డులు రివార్డులు కొల్లగొట్టే అర్హత ఉందని నిరూపణ అయ్యింది. ఆస్కార్ కి కూతవేటు దూరంలో ఉన్న RRR ఇటీవలే గోల్డెన్ గ్లోబ్స్ అవార్డు సహా రెండు క్రిటిక్స్ ఛాయిస్ అవార్డులను గెలుచుకుని వార్తల్లోకి వచ్చింది.
రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటించగా.. జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటించారు. విప్లవ యోధులుగా ఇరువురి నటనా తెరపై కట్టి పడేసింది. ప్రపంచవ్యాప్తంగా ఆ ఇద్దరికి ఫ్యాన్ ఫాలోయింగ్ తో పాటు అమాంతం ఇమేజ్ పెరిగింది.
ఎపిక్ పీరియాడికల్ డ్రామా కథాంశంతో రాజమౌళి చేసిన మ్యాజిక్ గురించి ప్రపంచ సినీదిగ్గజాలు వేదికలపై ఆసక్తిగా చర్చించడం మరపురాని ఘట్టం. తాజా సమాచారం మేరకు అవతార్ తరహాలోనే ఆర్.ఆర్.ఆర్ చిత్రం మళ్లీ విడుదలకు సిద్ధంగా ఉందని తెలిసింది. RRR చిత్రం 20 జనవరి 2023 నుండి దేవి థియేటర్ లో మాత్రమే ప్రదర్శితం కానుందని తెలిసింది.
ప్రస్తుతానికి బుకింగ్ లు ఐదు రోజులు మాత్రమే తెరుస్తున్నారు.
గోల్డెన్ గ్లోబ్ దక్కించుకున్న అరుదైన విజువల్ వండర్ RRR ను మళ్లీ పెద్ద తెరపై చూడాలనుకునే అభిమానులకు ఇది మంచి అవకాశం. అవతార్ రిలీజ్ తో పోలిక లేదు కానీ.. ఆర్.ఆర్.ఆర్ కి అవార్డుల తర్వాత పెరిగిన క్రేజ్ తో మళ్లీ ప్రజలు ఆదరిస్తారని చిత్రబృందం భావిస్తోంది.
ఈ చిత్రంలో అలియా భట్- అజయ్ దేవగన్- సముద్రఖని- ఒలివియా మోరిస్ - శ్రియా శరన్ ముఖ్య పాత్రలు పోషించారు. డివివి ఎంటర్ టైనర్ మెంట్స్ పతాకంపై డివివి దానయ్య నిర్మించారు. ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. కీరవాణి సంగీతం అందించిన 'నాటు నాటు..' మాస్ సాంగ్ తెలుగు సినిమా కీర్తి పతాకను వినువీధుల్లో ఎగురవేసిందని నేడు గోల్డెన్ గ్లోబ్ సాక్షిగా సగర్వంగా చెప్పుకోగలం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.