'ఆర్ ఆర్ ఆర్': ఆ 40 నిమిషాలూ గూస్ బంప్స్!

Update: 2022-01-25 04:43 GMT
రాజమౌళి దర్శకత్వంలో ... డీవీవీ దానయ్య నిర్మాణంలో 'ఆర్ ఆర్ ఆర్' సినిమా రూపొందింది. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా చరణ్ .. కొమరం భీమ్ గా ఎన్టీఆర్ కనిపించనున్నారు. ఈ రెండు కూడా ఈ సినిమాలో ప్రధానమైన పాత్రలు. సమానమైన ప్రాధాన్యతనిస్తూ రాజమౌళి నడిపించిన పాత్రలు. కథా నేపథ్యంలోనే యాక్షన్ .. ఎమోషన్ పుష్కలంగా ఉంటాయి. యాక్షన్ లోనే ఎమోషన్ ను మిక్స్ చేసి అందించడం రాజమౌళికి వెన్నతో పెట్టిన విద్య కనుక, ఆ తరహా సన్నివేశాలతో ఆయన అదరగొట్టేసి ఉంటాడనే అంతా అనుకుంటున్నారు. ఆ అద్భుతాన్ని తెరపై చూడటానికి తహతహలాడుతున్నారు.

సాధారణంగా ప్రతి సినిమాలో కూడా ప్రీ క్లైమాక్స్ లో ఎమోషన్ .. క్లైమాక్స్ లో యాక్షన్ ఉంటుంది. కానీ ఈ సినిమాలో ప్రీ క్లైమాక్స్ లోను .. క్లైమాక్స్ లోను యాక్షన్ సీక్వెన్స్  ఉంటాయని తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రతి సన్నివేశం ఆడియన్స్ ను కట్టిపడేసేలానే  ఉంటుందని అంటున్నారు. అయితే ఇంటర్వెల్ బ్యాంగ్ సీన్ .. క్లైమాక్స్ సీన్ ఆశ్చర్యచకితులను చేసేలా ఉంటుందని చెబుతున్నారు. చరణ్ - ఎన్టీఆర్ యాక్షన్ ఎపిసోడ్ పైనే ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటుందట. ఇక దానికి మించిన యాక్షన్ క్లైమాక్స్ లో ఉంటుందని అంటున్నారు.

ఈ రెండు యాక్షన్ ఎపిసోడ్స్ కోసం ఈ సినిమా బడ్జెట్ లో 30 శాతాన్ని ఖర్చు చేశారంటే, ఇక ఆ ఫైట్స్ ఏ రేంజ్ లో ఉంటాయనేది అర్థం చేసుకోవచ్చు. క్లైమాక్స్ ఫైట్ దాదాపు 40 నిమిషాల సేపు నడుస్తుందట. అంతసేపు కొట్టుకోవడాన్ని ఆడియన్స్ చూడగలరా? అనే సందేహం అవసరం లేదు. ఎందుకంటే ఒక బలమైన ఎమోషన్ తో ముడిపడిన యాక్షన్ బోర్ అనిపించదు. అలాగే ఒక బలమైన ఆశయాన్ని సాధించడానికి జరిగే పోరాటం కూడా అసహనాన్ని కలిగించదు. ఈ విషయం రాజమౌళికి బాగా తెలుసు గనుకనే, ఎమోషన్స్ ను టచ్ చేస్తూనే ఈ యాక్షన్ జరుగుతుంది.

ఈ 40 నిమిషాల యాక్షన్ ఎపిసోడ్ గూస్ బంప్స్ తెప్పించేలా, థియేటర్లలో నుంచి బయటికి వస్తూ దాని గురించి మాట్లాడుకునేలా ఉంటుందని చెబుతున్నారు. కరోనా తీవ్రత లేకపోతే ఈ సంక్రాంతికి ఈ సినిమా సందడి చేసేదే. కానీ కరోనా విజృంభణ కారణంగా వాయిదా పడింది. వేసవిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు  రావడం పక్కా అని చెబుతున్నారు. మార్చి 18వ తేదీన గానీ .. ఏప్రిల్ 28వ తేదీన గాని ఈ సినిమా థియేటర్లకు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మొత్తానికి ఈ ఏడాది మరో సంచలనానికి తెర తీయడానికి రాజమౌళి రెడీ అవుతున్నాడన్నమాట.     


Tags:    

Similar News