ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేడుక లాస్ ఏంజిల్స్ లో వైభవంగా జరిగింది. ఈ అవార్డుల వేడుకలో టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ఆర్ఆర్ సినిమా నాన్ ఇంగ్లీష్ మూవీ కేటగిరీలో అవార్డును సొంతం చేసుకుంటుందని అంతా నమ్మకం వ్యక్తం చేశారు.. కానీ నిరాశే మిగిలింది.
ఆర్‌ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ కు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కింది. ఉత్తమ సినిమా గా అవార్డు నామినేషన్ ను దక్కించుకున్నా కూడా అవార్డు రాక పోవడం పట్ల కాస్త నిరాశ ఉన్నా కూడా నాటు నాటు పాటకు అవార్డు రావడం పట్ల అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
నాన్ ఇంగ్లీష్ ఉత్తమ మూవీ కేటగిరీలో కొరియన్ మూవీ డిసిషన్ టు లీవ్.. జర్మన్ యాంటీ వార్ డ్రామా ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్, అర్జెంటీనా 1985 మరియు క్లోజ్ సినిమాలతో పాటు ఆర్ఆర్ఆర్ సినిమా నామినేషన్స్ ను దక్కించుకున్నాయి. ఇందులో అర్జెంటీనా 1985 సినిమాకు గోల్డెన్ గ్లోబ్ నాన్ ఇంగ్లీష్ మూవీ అవార్డు దక్కింది.
టాలీవుడ్ జక్కన్న రాజమౌళి ఖచ్చితంగా ఈ సినిమాకు గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకోవడం ఖాయం అంటూ అభిమానులతో పాటు అంతర్జాతీయ మీడియాలో ప్రచారం జరిగింది. అంతర్జాతీయ స్థాయి మీడియా లో సినిమా గురించి పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. కానీ తీవ్ర పోటీ మధ్య అర్జెంటీనా 1985 సినిమాకు అవార్డు సొంతం అయ్యింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.