ఏ సినిమాకి అయినా కానీ ఇటీవలి కాలంలో ప్రచారం చాలా ముఖ్యం. రిలీజ్ ముందు హైప్ పెంచడం ద్వారా బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగులకు ఆస్కారం ఉంటుంది. అందునా పాన్ ఇండియా సినిమాలకు ప్రచారార్భాటం కూడా చాలా చాలా అవసరంగా మారింది. అన్ని భాషల ఆడియెన్ ని థియేటర్లకు ఆకర్షించేందుకు పాన్ ఇండియా స్టార్లు చాలా ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ మార్పు మన పాన్ ఇండియా స్టార్లు డైరెక్టర్లలో స్పష్ఠంగా కనిపిస్తోంది. ప్రతిసారీ భారీ ఈవెంట్లతో జనంలోకి దూసుకెళుతున్నారు.
ఇంతకుముందు ఆర్.ఆర్.ఆర్ ప్రచారం కోసం ముంబైలో అడుగుపెట్టిన రాజమౌళి రామారావు రామ్ చరణ్ బృందం ఇకపై ఓ రెండు ఈవెంట్ల కోసం ఒకే వేదికపై కలవనున్నారు. ఇందులో దుబాయ్ ఈవెంట్ చాలా కీలకమైనది. దుబాయ్ బుర్జ్ ఖలీఫా అయినా షేకయ్యేలా ఈ ఈవెంట్ ని ప్లాన్ చేస్తున్నారని గుసగుస వినిపిస్తోంది.
అయితే దుబాయ్ ఈవెంట్ వెనక ఐడియా ఎవరిది? అంటే డార్లింగ్ ప్రభాస్ ఇచ్చిన ప్రోద్బలమేనని తెలుస్తోంది. రాజమౌళికి ఈ ఐడియా ఇచ్చింది బాహుబలి ప్రభాస్. దాని ప్రకారమే RRR ఈవెంట్ ని దుబాయ్ లో అత్యంత గ్రాండియర్ గా ప్లాన్ చేశారు. రాజమౌళి చాలా సీరియస్ గా దుబాయ్ ఈవెంట్ ని ప్లాన్ చేస్తున్నారు. ఈ వేడుక హైప్ పెంచేందుకు ఉపకరిస్తుందని ఆయన భావిస్తున్నారు. దుబాయ్ ఈవెంట్లో చరణ్ - తారక్ - రాజమౌళితో పాటు ప్రభాస్ కూడా ఒకే వేదికపై కనిపించే వీలుంది.
డాల్బీ సౌండ్స్ తో స్పెషల్ గా..
రిలీజ్ ముందు #RRR కి హైప్ అంతకంతకు పెరుగుతోంది. మార్చి 25 నుంచి థియేటర్లలో వీక్షణ కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉత్కంఠగా వేచి చూస్తున్నారు. ఈ సినిమాలో లార్జర్ దేన్ లైఫ్ క్యారెక్టర్లను రాజమౌళి ఏ రేంజులో ఎలివేట్ చేశారో చూడాలని ఒక వర్గం ఇంకా ఎక్కువ ఆసక్తిగా ఉంది. బాహుబలి గ్లింప్స్ ని మించి ఇంకేదైనా మ్యాజిక్ చేస్తారన్న ఉత్కంఠ అందరిలో ఉంది.
సౌండింగ్ లో ప్రత్యేకత ఆర్.ఆర్.ఆర్ రేంజును పెంచుతుందని భావిస్తున్నారు. థీమ్ ఎలివేషన్ కి కూడా ఇది అత్యంత అవసరం. ఇందులో దేశభక్తికి అదనంగా యాక్షన్ డ్రామా సెంటిమెంట్ రొమాన్స్ ఇలా ప్రతిదీ దేనికదే ప్రత్యేకంగా తీర్చిదిద్ది ఫుల్ మీల్స్ లాంటి సినిమాని రాజమౌళి అందిస్తున్నారని ఇప్పటికే ట్రైలర్ వెల్లడించింది. దేశంలోనే బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామాని రాజమౌళి అందిస్తున్నారు. #RRR దేశంలోనే తొలి డాల్బీ సినిమా అంటూ తాజాగా చిత్రబృందం ప్రకటించింది.
ఫరాస్ ఫిలిమ్స్ .. సారిగమ సినిమాస్ - రాఫ్తార్ క్రియేషన్స్ వంటివి కొన్ని విదేశీ ఏరియాల్లో విడుదల చేస్తున్నాయి.
ఈ చిత్రాన్ని నిర్మాతలు 2022 మార్చి 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు. అనేక వాయిదాల తర్వాత ఈ తేదీని నిర్ణయించాక అభిమానుల్లో చర్చ సాగింది. అయితే ఇప్పుడు పరీక్షల సీజన్ ఒకవైపు ఐపీఎల్ సీజన్ తో కొంత ఇబ్బంది ఉన్నా హైప్ పెంచడం ద్వారా కొన్నిటిని అధిగమించాలని ప్లాన్ చేస్తున్నారన్నమాట. కరోనా మూడవ వేవ్ భయాలు వైదొలగడం ప్లస్ అయినా కానీ పరీక్షల సీజన్ కావడం కొంత ఇబ్బందికరం.
మార్చి- ఏప్రిల్ లో విద్యార్థులకు పరీక్షలు ఉంటాయి. ఇది RRR కలెక్షన్లను కొంత ప్రభావితం చేయవచ్చు. ఇవన్నీ అవరోధాలుగా మారినా కానీ మూవీకి ఉన్న హైప్ ఎంత మాత్రం తగ్గడం లేదు. అన్నిటినీ అధిగమించి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందనే టీమ్ ఆశిస్తోంది.