బాహుబ‌లి నిర్మాత‌ల‌తో RRR నిర్మాత ఒప్పందం?

Update: 2019-11-26 14:30 GMT
దాదాపు 300 కోట్ల బ‌డ్జెట్ తో పాన్ ఇండియా కేట‌గిరీలో ఆర్.ఆర్.ఆర్ చిత్రాన్ని నిర్మిస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు డి.వి.వి.దాన‌య్య‌. చ‌ర‌ణ్-తార‌క్ లాంటి స్టార్ల‌ను క‌లిపి ద‌ర్శ‌కధీరుడు రాజ‌మౌళితో క‌లిసి ఈ సాహ‌సానికి పూనుకున్నారు. ఇప్ప‌టికే 70 శాతం చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకుని జూలై 30 రిలీజ్ ల‌క్ష్యంగా పెండింగ్ చిత్రీక‌ర‌ణ‌ను శ‌ర‌వేగంగా పూర్తి చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఇంత‌లోనే ఆ.ఆర్.ఆర్ కి సంబంధించి కొన్ని ట్విస్టులు ప‌రిశ్ర‌మ‌లో హాట్ టాపిక్ గా మారాయి. పాన్ ఇండియా కేట‌గిరీలో రిలీజైన సాహో-సైరా రిజ‌ల్ట్ చూశాక ద‌ర్శ‌క‌నిర్మాత‌లు బ‌డ్జెట్ విష‌యంలో ఎంతో ఆచితూచి అడుగులేయాల్సిన ప‌రిస్థితి త‌లెత్తింద‌ని ప్ర‌చార‌మైంది.

అయినా ఈ సినిమా బ‌డ్జెట్ ని అదుపు చేయ‌డం అంత సులువుగా ఏమీ లేద‌ట‌. ఎంపిక చేసుకున్న భారీ కాస్టింగ్.. క‌థ‌కు త‌గ్గ‌ట్టు భారీ విజువ‌ల్ గ్రాఫిక్స్ .. భారీ సెట్స్ లో పాట‌ల చిత్రీక‌ర‌ణ‌.. భారీ వార్ ఎపిసోడ్స్ వ‌గైరా వ‌గైరా కార‌ణాల‌తో ఆర్.ఆర్.ఆర్ బ‌డ్జెట్ ఇప్ప‌టికే అన్ లిమిటెడ్ గా పెరుగుతోంద‌న్న స‌మాచారం ఉంది. ఆరంభ‌మే బ‌య్య‌ర్ల నుంచి అడ్వాన్సులు తీసుకుని సినిమా మొద‌లెట్టినా.. ఇప్పుడు అనుకున్న దానికంటే బ‌డ్జెట్ ఎక్కువ‌య్యే ప‌రిస్థితి క‌నిపిస్తోంద‌ట‌.

అయితే ఈ స‌న్నివేశంలో డీవీవీ ఎంట‌ర్ టైన్ మెంట్స్ అధినేత దాన‌య్య‌కు మ‌రో చిక్కు వ‌చ్చి ప‌డింద‌ని తెలుస్తోంది. డీవీవీ బ్యాన‌ర్ లోనే తెర‌కెక్కి డిజాస్ట‌ర్ అయిన భారీ బ‌డ్జెట్ చిత్రం `విన‌య విధేయ రామా` ప్ర‌భావం ఇప్పుడు దాన‌య్య‌పై ఒత్తిడి పెంచుతోంద‌ట‌. అప్ప‌ట్లో చేసిన కొన్ని అప్పులు దాన‌య్య‌పై ఒత్తిడికి కార‌ణం. ఫైనాన్షియ‌ర్ల వైపు నుంచి తీవ్ర‌ ఒత్తిడి త‌ప్ప‌డం లేద‌ని తెలుస్తోంది. ఆ క్ర‌మంలోనే ఈ స‌న్నివేశాన్ని హ్యాండిల్ చేసేందుకు దాన‌య్య బృందం ఆర్కా మీడియాతో చేతులు క‌లిపే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ఆర్కా అధినేత‌ల‌తో ప్ర‌స్తుతం డీల్ కి సంబంధించిన ప‌లు అంశాల్ని డీవీవీ సంస్థ మాట్లాడుతోంద‌ట‌. కొన్ని కండిష‌న్లతో ఆర్కా సంస్థ భాగ‌స్వామ్యానికి ఆస్కారం ఉంద‌ని తెలుస్తోంది. బాహుబ‌లి లాంటి క్రేజీ ఫ్రాంఛైజీతో ఆర్కా రేంజు ఇంట‌ర్నేష‌న‌ల్ లెవ‌ల్ అని ప్రూవైంది. ఈ బ్యాన‌ర్ చేరిక‌తో దాన‌య్య క‌ష్టాలు తీర‌తాయా..? అప్పుల ఒత్తిళ్లు త‌గ్గనున్నాయా? అన్న‌ది చూడాలి.
Tags:    

Similar News