మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల తొలి కలయికలో తెరకెక్కించిన పాన్ ఇండియా సంలచనం 'RRR'. అత్యంత భారీ స్థాయిలో రాజమౌళి తెరకెక్కించిన ఈ మూవీ ఈ ఏడాది మార్చిలో ప్రపంచ వ్యాప్తంగా విడుదలై రికార్డు స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంది. అంతే కాకుండా వసూళ్ల పరంగానూ సరికొత్త రికార్డులు సృష్టించింది. యావత్ దేశ వ్యాప్తంగా వున్న అన్ని వర్గాల ప్రేక్షకులతో పాటు వరల్డ్ వైడ్ గా వున్న తెలుగు వాళ్లు ఈ మూవీకి బ్రహ్మరథం పట్టారు.
ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన తరువాత ఈ మూవీపై విదేశీ ప్రేక్షకులతో పాటు హాలీవుడ్ మేకర్స్ కూడా సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. త్వరలో జరగనున్న ఆస్కార్ బరిలోనూ ఈ మూవీ వివిధ విభాగాల్లో నామినేట్ కావాలని విశ్వప్రయత్నాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇదిలా వుంటే ఈ మూవీలో నటించిన హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ జపాన్ లో ప్రత్యక్ష్యం అయ్యారు.
రాజమౌళి అత్యంత సాహసోపేతంగా తెరకెక్కించిన 'బాహుబలి' సినిమాని ఇతర భాషలతో పాటు జపాన్, చైనాలో రిలీజ్ చేసి విషయం తెలిసిందే. అక్కడ ఈ మూవీకి జపాన్ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఆ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న 'RRR' టీమ్ ఈ మూవీని కూడా జపాన్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంది. ఈ మూవీని జపాన్ లో అక్టోబర్ 21న విడుదల చేస్తున్నారు. ఇటీవల 'RRR' స్పెషల్ స్క్రీనింగ్ ల కోసం యుఎస్ లో ప్రత్యేకంగా పర్యటించిన రాజమౌళి ఇప్పడు రామ్, భీమ్ లతో కలిసి జపాన్ లో హంగామా చేయబోతున్నాడు.
రామ్ చరణ్, ఎన్టీఆర్ లు కూడా ఇప్పటికే ఈ మూవీని జపాన్ లో ప్రమోట్ చేయడం కోసం అక్కడికి వెళ్లిపోయారు. సినిమా విడుదలై ఏడు నెలలు కావస్తున్నా ఇప్పటికీ ఏదో రకంగా వార్తల్లో నిలుస్తూ వస్తోంది. బహుశా ఇలా నిత్యం వార్తల్లో నిలిచిన సినిమా ఇదేనేమో. ప్రస్తుతం తన టార్గెట్ ఆస్కార్ పైనే వున్నా ..
దాని ప్రచారం కోసం భారీ ఖర్చు అవుతుందని తెలిసినా రాజమౌళి ఎక్కడా తగ్గడం లేదు. ప్రతీ దర్శకుడికి ఇలాంటి ఛాన్స్ లైఫ్ లో ఒక్క సారి మాత్రమే వస్తుంది. అలాంటి అరుదైన అవకాశాన్ని జారవిడుచుకోకూడదనే పట్టుదలతో రాజమౌళి ఆస్కార్ బరిలో తన సినిమాని నిలపడం కోసం సర్వ శక్తులు ఒడ్డుతుండటం విశేషం.
ఇదిలా వుంటే రామ్ చరణ్, ఎన్టీఆర్ ఈ మూవీ ప్రమోషన్స్ కోసం జపాన్ లో లాండయ్యారు. ఇద్దరి సినిమాల షూటింగ్ లకు పలు కారణాల వల్ల బ్రేక్ పడటంతో ఇద్దరు జక్కన్నకు సమయానికి ఖాలీగా చిక్కారు. దీంతో వారిని 'RRR' ప్రమోషన్స్ కోసం జపాన్ కి తీసుకెళ్లిపోయాడు. అక్కడ ఇద్దరు స్టార్లతో కలిసి రాజమౌళి విస్తృతంగా RRR ని ప్రమోట్ చేయబోతున్నాడు. దీంతో హైదరాబాద్ నుంచి మొదలైన RRR ప్రమోషన్స్ ఇప్పడం ఖండాంతరాలకు చేరడం విశేషం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.