రామ్ ని...భీమ్ భ‌లే సింక్ చేసారే!

Update: 2022-07-24 04:36 GMT
పాన్ ఇండియా చిత్రం `ఆర్ ఆర్ ఆర్` విడుద‌లై నెల‌లు గడుస్తున్నా? ఇంకా నెట్టింట డే బై డే సంచ‌ల‌న‌మ‌వుతోన్న సంగ‌తి తెలిసిందే. అల్లూరి సీతారామ‌రాజు పాత్ర పోషించిన‌  మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కి హాలీవుడ్ అవ‌కాశాల వెల్లువ‌.. కొమ‌రం భీమ్ పాత్ర పోషించిన ఎన్టీఆర్ ట్విట‌ర్ లో సంచ‌ల‌నంతోనే `ఆర్ ఆర్ ఆర్` హాట్ టాపిక్ అవుతోంది.

జపాన్ లో సైతం `ఆర్ ఆర్ ఆర్` పెద్ద ఎత్తున రిలీజ్ అవుతుంది. ఆ ర‌కంగా `ఆర్ ఆర్ ఆర్` గ్లోబ‌ల్ స్థాయిలో రీచ్ అవ్వ‌డంపై స‌ర్వ‌త్రా  హ‌ర్షం వ్య‌క్తం అవుతుంది. `బాహుబ‌లి` త‌రహాలో ఫేమ‌స్ అవుతుందా?  లేదా? అన్న మీమాంస‌కి  ఇలాంటి సంకేతాల‌తో  తెర ప‌డుతుంది. తాజాగా సినిమాలో ఓ ఇంట్రెస్టింగ్  సీన్ కి రాజీవ్ క‌న‌కాల వాయిస్ ఓవ‌ర్ ని సింక్ చేసి వావ్ అనిపించారు.

రాజీవ్ ఆంగ్లేయుల వ‌ద్ద‌కు వెళ్లి  భీమ్ గురించి ఇచ్చే ఇంట్ర‌డ‌క్ష‌న్ సినిమాలో హైలైట్ గా నిలుస్తుంది. ``త‌ప్పిపోయిన ఆ గొర్రె పిల్ల‌కోసం ఆ కాప‌రి ఎంత దూర‌మైనా వెళ్తాడు. ఎక్క‌డికైనా వ‌స్తాడు. ప‌గ‌లైనా..రాత్రైనా.. కొండ‌..కోన.. గుట్ట‌..మెట్ట  జ‌ల్లెడ ప‌ట్టి మ‌రీ జాడ తెలుసుకుంటాడు. ఆ స‌మ‌యానికి ఆ గొర్రె పిల్ల పెద్ద పులి నోట్లో ఉన్నా ఆ పులి కోర‌లు పీకి..ద‌వ‌డ‌లు చీల్చి మ‌రీ వెనుక‌కి తీసుకెళ్లి మంద‌లో క‌లిపేస్తాడు.

స‌రిగ్గా ఇదే వాయిస్ ఓవ‌ర్ ని  సినిమాలో రామ్ చ‌ర‌ణ్ ఆంగ్లేయుల బంధీగా చేసి  ట‌న్నెల్ లో దిచి పెట్టిన సీన్ కి సింక్ చేసారు.  ఆ ట‌న్నెల్ వ‌ద్ద‌కు భీమ్ చేరుకుని రామ్ ని విడిపించి సీత (అలియాభ‌ట్) కి అప్ప‌గించిన సీన్ సింక్ చేసి నెట్టింట వ‌దిలారు. ప్ర‌స్తుతం ఆ వీడియో  అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. చ‌ర‌ణ్‌..ఎన్టీఆర్ అభిమానుల్ని ఇప్పుడా సీన్ విప‌రీతంగా ఆక‌ట్ట‌కుంటుంది.

సింకింగ్ సూప‌ర్బ్ అంటూ ఫ్యాన్స్ త‌మ‌దైన శైలిలో  కామెంట్లు పెడుతున్నారు. మ‌రి ఇలాంటి సీన్లు ఇంకెన్ని తెర‌పైకి వ‌స్తాయో చూడాలి. ఈ చిత్రానికి రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా..డి.వి.వి దాన‌య్య భారీ బ‌డ్జెట్ తో నిర్మించిన సంగ‌తి తెలిసిందే. ఎం.ఎం . కీర‌వాణీ సంగీతం స‌మ‌కూర్చారు. 

https://twitter.com/kvvcsr1432/status/1550699727427031040
Tags:    

Similar News