#RRR నిజాంపై గెరిల్లా వార్ ఆంధ్రా అడ‌వుల్లోనా?

Update: 2019-12-18 05:56 GMT
పాన్ ఇండియా మూవీ #RRR ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా హాట్ టాపిక్. బాహుబ‌లి ఫ్రాంచైజీ త‌ర్వాత ఎస్.ఎస్.రాజ‌మౌళి నుంచి వ‌స్తున్న సినిమాగా ఇటు తెలుగు సినీప‌రిశ్ర‌మ స‌హా అటు బాలీవుడ్ ... ఇత‌ర ప‌రిశ్ర‌మ‌ల్లోనూ వాడి వేడిగా ఈ సినిమాపై చ‌ర్చ సాగుతోంది. 2020 జూలై 30 రిలీజ్ తేదీ అంటూ ప్ర‌క‌టించ‌డంతో ఇక స‌రిగ్గా ఆరు-ఏడు నెల‌ల స‌మ‌యం మాత్ర‌మే మిగిలి ఉంది. 210 రోజులే ఇంకా బ్యాలెన్స్. అంటే ఆర్.ఆర్.ఆర్ కి కౌంట్ డౌన్ మొద‌లైంద‌న్న‌మాట‌. అయితే ఇప్ప‌టికి కేవ‌లం 70 శాతం షూటింగ్ జ‌రిగింది. మ‌రో 30 శాతం షూటింగ్ ను పూర్తి చేయాలి. పైగా షూటింగుని మించి డ‌బుల్ టైమ్ తీసుకునే కాంప్లికేటెడ్ వీ.ఎఫ్.ఎక్స్ కోసం చాలా శ్ర‌మించాల్సి ఉంటుంది. పైగా ఈ చిత్రంలో హైలైట్ కానుంద‌న్న ప్ర‌చారం ఉంది.

తెల్ల దొర‌ల‌పై పోరాడే విశాఖ మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజుగా రామ్ చ‌రణ్ న‌టిస్తున్నారు. ఆయ‌న భార్య సీత‌గా ఆలియాభ‌ట్ న‌టిస్తోంది. తెల్ల‌దొర‌ల‌పై పోరాడుతూ అడ‌వుల్లో సంచ‌రించే .. దాగుడుమూత‌లు ఆడే మ‌న్యం వీరుడు అల్లూరిని చివ‌రికి ఆంగ్లేయుల నిర్ధ‌య‌గా చంపిన స‌న్నివేశం ఈ చిత్రంలో ఉంటుంది. ఇక  నైజాం పాల‌కుల‌కు ఫుల్ కోటింగ్ ఇచ్చిన నైజాం గిరిజ‌న వీరుడు కొమురం భీమ్ పాత్ర అంతే ప్ర‌ధానంగా ఉంటుంది. ఈ పాత్ర‌లో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టిస్తుండ‌డం... ఆ పాత్ర ఒక తెల్ల‌దొర కుమార్తెతో ప్రేమ‌లో ప‌డేదిగా ఉండ‌డం ఉత్కంఠ‌ను పెంచుతున్నాయి.

ప్ర‌స్తుతం RRR షూటింగ్ విశాఖ మ‌న్యం ప్రాంతంలో జరుగుతోంది. ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నైజాం పాలకులను ఎదిరించే సన్నివేశాలు చిత్రీకర‌ణ సాగుతోంది. పోడు వ్యవసాయం చేసే తెగల కష్టనష్టాలు.. నిజాం నిరంకుశ సేన‌ల దౌర్జ‌న్యాల‌పై గెరిల్లా పోరాటాన్ని తెర‌కెక్కిస్తున్నార‌ని తెలుస్తోంది. వాస్త‌వానికి నైజాంలో జ‌రిగిన క‌థ‌ను ఆంధ్రా అడ‌వుల్లో .. అందునా విశాఖ మ‌న్యంలో తెర‌కెక్కిస్తుండ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. అలాగే లండన్  థియేట‌ర్ ఆర్టిస్ట్ ఒలీవియా తార‌క్ తో రొమాన్స్ చేయ‌బోతోంది కాబ‌ట్టి.. ప్ర‌స్తుత స‌న్నివేశాల్లో జాయిన్ అవుతుందా లేదా? అన్న‌ది చిత్ర‌బృందం వెల్ల‌డించాల్సి ఉంటుంది. దాదాపు 250 కోట్ల బ‌డ్జెట్ తో బాహుబ‌లి కి ధీటుగా నిర్మించేందుకు డీవీవీ ఎంట‌ర్ టైన్ మెంట్స్ బృందం పెట్టుబ‌డులు స‌మ‌కూరుస్తోంది. ఎం.ఎం.కీర‌వాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
Tags:    

Similar News