2022లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ''ఆర్.ఆర్.ఆర్'' సినిమా ఉంటుంది. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో ఎన్టీఆర్ - రామ్ చరణ్ హీరోలుగా నటించారు. ఇద్దరు విప్లవ వీరుల పాత్రలను ఆధారంగా చేసుకుని ఫిక్షనల్ కథాంశంతో ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాని తెరకెక్కించారు. అయితే అశేష ప్రేక్షకాదరణ దక్కించుకున్న ఈ చిత్రాన్ని ఆస్కార్ అవార్డ్స్ కు అఫీషియల్ ఎంట్రీగా పంపకపోవడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.
థియేట్రికల్ రిలీజ్ లో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టిన RRR.. ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన తర్వాత అంతర్జాతీయంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రముఖ హాలీవుడ్ ఫిలిం మేకర్స్ సైతం ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. కచ్చితంగా ఆస్కార్ వెళుతుందటూ ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ అభిప్రాయ పడ్డాయి. నామినేషన్స్ ప్రాబబుల్ లిస్టులో చోటు కల్పించారు.
దీంతో ఆస్కార్ అవార్డ్ రేసులోకి మన దేశం తరపున ట్రిపుల్ ఆర్ వెళుతుందని అందరూ భావించారు. కానీ చివరకు నిరాశే ఎదురైంది. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తెలుగు చిత్రాన్ని పక్కన పెట్టి 'చె షో' అనే గుజరాతీ చిత్రాన్ని ఆస్కార్ ఎంట్రీగా ఎంపిక చేసింది. దీంతో టాలీవుడ్ సినీ అభిమానులు మరియు ట్రిపుల్ ఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందిస్తున్నారు. స్క్రీనింగ్ కమిటీని నిందిస్తూ తమ ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆర్.ఆర్.ఆర్ సినిమాను కాకుండా.. అసలు ఇప్పటి వరకూ పేరే తెలియని చిత్రాన్ని ఆస్కార్ కు ఎలా ఎంపిక చేసి పంపిస్తారని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. దీని వెనుక రాజకీయ కారణాలు కూడా ఉండొచ్చని మరికొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
నిజానికి 'ఆర్.ఆర్.ఆర్' సినిమాకు గ్లోబల్ అప్రిషియేషన్ దక్కిన తర్వాత ఆస్కార్ అవార్డ్స్ గురించి మొదలైంది. ఉత్తమ నటీనటులు - సాంకేతిక నిపుణుల విభాగాల్లో నామినేషన్ ఉంటుందని అనుకున్నారు. ఈ మేరకు 'RRR ఫర్ ఆస్కార్' అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు. అయితే ఫిల్మ్ ఫెడరేషన్ అందరి ఆశలపై నీళ్లు చెల్లింది.
అయితే ఆస్కార్ అవార్డ్స్ కి మన దేశం తరపున ఎంపికైన 'చెలో షో' సినిమా ఒరిజినల్ మూవీ కాదనే కామెంట్స్ వస్తున్నాయి. ఇది 1988లో వచ్చిన 'సినిమా పారడైసో' అనే అకాడమీ అవార్డ్ విన్నింగ్ హాలీవుడ్ చిత్రానికి ప్రీమేక్ అని.. అలాంటి సినిమాను ఆస్కార్ కు ఎంపిక చేస్తే అవార్డ్ ఎలా వస్తుందనే వాదనలు కూడా వినిపిస్తున్నారు.
RRR సినిమా ఇండియా తరపున అధికారిక ఎంట్రీగా వెళ్లుంటే కచ్చితంగా తెలుగు ప్రేక్షకులు గర్వంగా ఫీల్ అయ్యేవారు. కానీ ఇప్పుడు నిరాశ చెందాల్సి వచ్చింది. అయితే ట్రిపుల్ ఆర్ ను ఆస్కార్ కు పంపనందుకు ఓ వర్గం మాత్రం నెట్టింట సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సినిమాకు ఆస్కార్ కు వెళ్లే అర్హత లేదని కామెంట్స్ చేస్తున్నారు.
ఇటీవల కాలంలో తెలుగు సినిమా పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. దీంతో టాలీవుడ్ మీద కొందరు అసూయ పడుతున్నారని.. ఈ నేపథ్యంలో ఇప్పుడు RRR పై విమర్శలు చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా తమిళ సినీ అభిమానులు దీంట్లో భాగం అవుతున్నారని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే 'ఆర్.ఆర్.ఆర్' ఆస్కార్ ఆశలు సజీవంగానే ఉన్నట్లు వెరైటీ అనే ఇంటర్నేషనల్ మ్యాగజైన్ పేర్కొంది. యూఎస్ఏ డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమాని అకాడమీ సభ్యులకు స్పెషల్ స్క్రీనింగ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని.. ఓటింగ్ ద్వారా అన్ని కేటగిరీలలో ఈ చిత్రాన్ని నామినేట్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. ఆస్కార్ వచ్చినా రాకపోయినా.. RRR సినిమా మాత్రం రచ్చ గెలిచి ఇంట ఓడిపోయిందని సినీ అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.