దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ చిత్రాన్ని పాన్ ఇండియా కేటగిరీలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. జూలై 30న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణను పూర్తి చేస్తున్నారు.
ఈ చిత్రంలో ఇద్దరు మన్యం వీరుల కథల్ని ఫిక్షనల్ అంశాల్ని జోడించి తెరపై చూపిస్తున్నారు. విశాఖ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు.. తెలంగాణ మన్యం వీరుడు కొమురం భీమ్ .. ఈ ఇద్దరూ స్వాతంత్య్రోద్యమంలో కలుసుకుని ఉంటే ఏం జరిగేది? అన్న ఫిక్షన్ కథని తెరపై చూపిస్తున్నారు.
ప్రస్తుతం తారక్ సహా కీలక చిత్రబృందంపై సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. విశాఖ మన్యం అయిన పాడేరు మండలంలో మోదాపల్లి.. డల్లాపల్లి ప్రాంతాల్లోని కాఫీ తోటల్లో ఆరు రోజుల పాటు సినిమాకు సంబంధించిన క్తైమాక్స్ సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. దర్శకుడు రాజమౌళి కాఫీ తోటలను పరిశీలించి చాలా ముందస్తుగానే చిత్రీకరించాల్సిన సీన్ లను అసిస్టెంట్ డైరెక్టర్లకు వివరించారట.
ఇక ఆన్ లొకేషన్ కి వెళ్లేందుకు ఎన్టీఆర్ ప్రిపరేషన్ మామూలుగా లేదు. ఆయన హైదరాబాద్ నుంచి విశాఖ శంషాబాద్ విమానాశ్రయంలో దిగినప్పుడు తనని ఎవరూ గుర్తుపట్టకుండా పూర్తి బ్లాక్ డ్రెస్ .. బ్లాక్ క్యాప్ ధరించారు. ప్రస్తుతం ఆ ఫోటోలు.. వీడియో అంతర్జాలంలో జోరుగా వైరల్ అవుతున్నాయి. తారక్ కి విశాఖలో మాస్ ఫాలోయింగ్ అసాధారణం. అందుకే తగు జాగ్రత్తలు తీసుకున్నారని అర్థమవుతోంది. అప్పటికీ విశాఖ విమానాశ్రయంలో దిగగానే జైజై ఎన్టీఆర్ అంటూ అభిమానులు నినదించారు. సెల్ ఫోన్లలో వీడియోల్ని చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో వాటిని పోస్ట్ చేశారు. ఇక విమానాశ్రయ సిబ్బంది పోలీస్ ఎన్టీఆర్ అభిమానుల్ని కంట్రోల్ చేయడానికి ఎంతగా శ్రమించాల్సొచ్చిందో తెలిపే వీడియ్ వైరల్ గా మారింది.