పోయిన శుక్రవారం వచ్చిన ‘బ్రూస్ లీ’ పరిస్థితేంటో తేలిపోయింది. ఆ సినిమా బ్రేక్ ఈవెన్ కు రావడం అసాధ్యమని తేలిపోయింది. ఐతే ఈ సినిమాకున్న బ్యాకప్ ప్రకారం చూస్తే మరీ కంగారేమీ పడాల్సిన పని లేదు. రామ్ చరణ్ మరోసారి దానయ్యకే సినిమా చేసి.. ఆయనకి, బయ్యర్లకు సర్దుబాటు ప్రయత్నం చేసే అవకాశాలు లేకపోలేదు.
కానీ అంతకముందు వారం వచ్చిన గుణశేఖర్ కలల సినిమా ‘రుద్రమదేవి’ పరిస్థితి వేరు. ఇక్కడ ఇంకో సినిమా గురించి ఆలోచించే పరిస్థితి లేదు. ఏం రికవర్ చేసినా, నష్ట నివారణ జరిగినా ఈ సినిమా ద్వారానే జరగాలి. అందుకే ఆ సినిమా చివరికి ఎంత వసూలు చేస్తుందన్నది చాలా ముఖ్యం. మరి ఇంతకీ బాక్సాఫీస్ దగ్గర ‘రుద్రమదేవి’ పరిస్థితేంటి? తెలుసుకుందాం పదండి.
తొలి వారం ముగిసేసరికి ‘రుద్రమదేవి’ తెలుగు వెర్షన్ రూ.35 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. తొలి మూడు రోజుల్లోనే రూ.25 కోట్ల షేర్ వసూలు చేసిన రుద్రమదేవి తర్వాతి నాలుగు రోజుల్లో రూ.10 కోట్లే వసూలు చేయడం చిన్న ఫిగర్ గానే కనిపించినప్పటికీ.. డివైడ్ టాక్ ను తట్టుకుని.. వీక్ డేస్ లో ఈ మాత్రం వసూళ్లు సాధించడం గొప్ప విషయం. రెండో వీకెండ్ లో ‘బ్రూస్ లీ’ లేకుంటే ‘రుద్రమదేవి’ కచ్చితంగా ఇంకో పది కోట్లయినా కొల్లగొట్టి ఉండేదేమో. కానీ ఆ అవకాశం లేకపోయింది. థియేటర్లు బాగా తగ్గించేశారు. దీంతో ఓ మోస్తరు వసూళ్లతో నెట్టుకొచ్చింది ‘రుద్రమ’. మొత్తంగా రుద్రమదేవి తెలుగు వెర్షన్ ఫైనల్ ఫిగర్ రూ.40 కోట్లు దాటి కాస్త ముందుకెళ్లే అవకాశముంది.
హిందీ వెర్షన్ హక్కులు రూ.5 కోట్లకు అమ్మగా.. అక్కడ తొలి వారం కేవలం కోటి రూపాయల షేర్ మాత్రమే వచ్చింది. అక్కడది డిజాస్టర్ కింద లెక్క. ఐతే వారం లేటుగా విడుదలైన తమిళ వెర్షన్ మాత్రం మంచి వసూళ్లు సాధిస్తోంది. తమిళ హక్కుల్ని శాటిలైట్ తో కలిసి రూ.10 కోట్లకు అమ్మినట్లు సమాచారం. ఆ మొత్తం ఈజీగా వసూలైపోవచ్చు. మలయాళ వెర్షన్ రూ..1.10 కోట్లకు అమ్మగా అక్కడ అంత కంటే ఎక్కువ షేర్ వచ్చింది.