రుద్రమ.. బ్రూస్‌ లీ.. కన్నేశారుగా..

Update: 2015-10-06 22:30 GMT
ఓవర్‌ సీస్‌ మీదనే దాదాపు ప్రతీ హీరో ఇప్పుడు కన్నేస్తున్నాడు. కాకపోతే తెలుగులో రామ్‌ చరణ్‌ మాత్రం.. లోకల్‌ రాష్ట్రంలలో 40+ షేర్‌ హిట్లు కొట్టినా కూడా బయట దేశాల్లో మాత్రం ఎందుకో ఖాతా తెరవలేకపోతున్నాడు. అలాగే ఎంతో టాలెంటెడ్‌ దర్శకుడు గుణశేఖర్‌ పరిస్థితి కూడ ఇంతే. లోకల్‌ లోనే ఈ మధ్యన మన దర్శకుడి పప్పులు ఉడకట్లేదు.. ఇక ఓవర్‌ సీస్‌ లో ఏం ఉడుకుతాయిలే. అందుకు ఇప్పుడు ఈ సినిమాల పంపిణీదారులు వీరికి భారీ సాయం చేస్తున్నారు.

అక్టోబర్‌ 9న వచ్చే రుద్రమదవేవి.. అక్టోబర్‌ 16న రానున్న బ్రూస్‌ లీ సినిమాలను ఓవర్సీస్ లో భారీ ఎత్తున బ్రూస్ లీ ది ఫైటర్ ని రిలీజ్ చేయబోతున్నారు. ఒక ప్రక్కన రుద్రమదేవి ఓవర్సీస్ లో  మరీ ముఖ్యంగా అమెరికాలో 160 స్క్రీన్స్‌ లో రిలీజ్‌ అవ్వబోతుంటే.. బ్రూస్‌ లీ ఏకంగా 220 పైచిలుకు స్క్రీన్స్ లో వస్తోంది. బ్రూస్‌ లీ గురించి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఇక రుద్రమ గురించి చూసుకున్నా... 160 అంటే బాగా ఎక్కువ.  బ్రూస్ లీకి వైట్ల డైరెక్టర్ కావడంతో.. ఇక్కడ మిలియన్ డాలర్ మార్క్ చరణ్ ఈసారి తేలిగ్గానే అందుకుంటాడనే అనిపిస్తోంది. అంతేకాకుండా. ఈ మూవీలో చిరంజీవి స్పెషల్ రోల్ చేయడం కూడా కలిసొచ్చే అంశమే. ఇకపోతే రుద్రమ విషయానికొస్తే.. మన చరిత్రను మనం తెలుసుకుందాం అనే ఆసక్తి ఎన్నారై లలో ఉంటే మాత్రం సినిమా సూపర్‌ హిట్టే. లేదూ.. సినిమాలో గ్రాఫిక్సు బాగా లేవు.. హీరోయిజం లేదు అనుకుంటే మాత్రం కష్టం.

నిజానికి 153 స్ర్కీన్స్‌ లో మాత్రమే రిలీజ్‌ అయిన మహేష్‌ బాబు ఆగడు.. సింపుల్‌ గా 1 మిలియన్‌ కొట్టేసింది. రిజల్ట్‌ తో పనిలేకుండా మనోడు అక్కడ రఫ్ఫాడించాడు. మరి ఇదే పరిస్థితి మన చెర్రీ, అనుష్క, గుణశేఖర్‌ వంటి స్టార్లకు లేదు. చూద్దాం ఏమవుతుందో...
Tags:    

Similar News