బాహుబలి స్టార్‌ తో సూపర్‌ స్టార్‌ వారసుడి డేటింగ్‌..!

Update: 2023-01-05 07:37 GMT
కెనడియన్ ముద్దుగుమ్మ నోరా ఫతేహీ బాలీవుడ్‌ సినిమాలతో పాటు సౌత్‌ లో బాహుబలి ఇంకా పలు సినిమాల్లో సందడి చేసి దేశ వ్యాప్తంగా పాపులారిటీని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. హీరోయిన్ గానే కాకుండా మోడల్ గా.. సోషల్ మీడియాలో పలు రకాలుగా నోరా ఫతేహీ ఎప్పుడు వార్తల్లో ఉంటూనే ఉంది.

తాజాగా ఈ అమ్మడు న్యూ ఇయర్ పార్టీలో పాల్గొంది. ఆ పార్టీలో సూపర్ స్టార్‌ షారుఖ్‌ ఖాన్‌ తనయుడు ఆర్యన్ ఖాన్ కూడా పాల్గొన్నాడు.

ఒక అభిమాని ఆర్యన్‌ ఖాన్‌ మరియు నోరా ఫతేహీతో ఉన్న ఫొటోలను సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేయడంతో షారుఖ్‌ ఖాన్‌ అభిమానులు మరియు ఒక వర్గం మీడియా సర్కిల్స్ వారు ఇష్టానుసారంగా ప్రచారం చేస్తున్నారు.

ఆర్యన్‌ ఖాన్‌ మరియు నోరా ఫతేహీ లు డేటింగ్‌ లో ఉన్నారని ఈ ఫొటోలే సాక్ష్యం అన్నట్లుగా వారు కామెంట్స్ చేస్తున్నారు. కానీ ఈ వాదనలో ఏమాత్రం నిజం లేదు.

అసలు వారిద్దరి మధ్య బలమైన స్నేహం కూడా ఉండి ఉండదు అంటూ కొందరు బాలీవుడ్‌ వర్గాల వారు ఆ వార్తలను ఖండిస్తూ బలంగా వాదిస్తూ ఉన్నారు.

అనుకోకుండా ఆ పార్టీకి ఇద్దరు హాజరు అయ్యి ఉంటారు.. అంతే తప్ప వారిద్దరు కలిసి అది కూడా లవర్స్ మాదిరిగా హాజరు అయ్యి ఉండరు అనేది చాలా మంది వాదన. కానీ కొందరు మాత్రం ఇద్దరు డేటింగ్ లో ఉన్నారంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ విషయమై నోరా లేదా ఆర్యన్ ఖాన్‌ లు ఎలా స్పందిస్తారో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News