ఫలానా హీరోతో ఆ సినిమా కథానాయిక కు ఎఫైర్ అంటూ ప్రచారం సహజమే. కానీ ఇప్పుడు ఓ ప్రముఖ హీరోయిన్ తో హీరో గొడవ పడ్డారట.. ఆ ఇద్దరి మధ్యా కలతలున్నాయి! అంటూ ఓ కొత్త ప్రచారం టాలీవుడ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.
ఇంతకీ ఈ కలతలు ఎవరెవరి మధ్య అంటే.. ప్రభాస్ - పూజా హెగ్డే ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం లేదంటూ పుకార్ షికార్ చేస్తోంది. రొమాంటిక్ డ్రామా రాధే శ్యామ్ లో ఈ జంట నటించారు. వచ్చే ఏడాది మకర సంక్రాంతి కానుకగా ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో యువి క్రియేషన్స్ బిజీగా ఉండగా ఈ కొత్త రూమర్ వేడెక్కిస్తోంది.
తాజా రూమర్ పై రాధే శ్యామ నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇవి నిరాధార వార్తలు అంటూ క్లారిటీనిచ్చింది. ప్రభాస్- పూజా హెగ్డే ఒకరిపై ఒకరు గొప్ప గౌరవం కలిగి ఉన్నారు. ఒకరంటే ఒకరు ప్రశంసలు కురిపిస్తారు. ఆఫ్ ద స్క్రీన్ లో గొప్ప స్నేహభావాన్ని పంచుకుంటారు. దానివల్ల తెరపైనా మాయ చేసేంతగా గొప్ప రొమాన్స్ .. కెమిస్ట్రీ పండాయి.. అని యువి సంస్థ క్లారిటీనిచ్చింది. ``పూజ ఎప్పుడూ చిత్రీకరణల విషయంలో ఇబ్బంది పెట్టలేదు. చాలా సమయపాలనతో ఉండేది. నిజానికి ఆమెతో పని చేయడం చాలా సులభం. ఈ రూమర్స్ కేవలం కొందరి ఊహకు తగ్గట్టుగా ఉన్నాయి. నాయకానాయికలు.. మొత్తం టీమ్ మధ్య ప్రతిదీ బాగానే ఉన్నాయి. ప్రేక్షకులు మర్చిపోలేని థియేట్రికల్ అనుభవాన్ని అందించడానికి చాలా సంతోషిస్తున్నాను`` అని సుదీర్ఘ వివరణ ఇచ్చింది.
రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన రాధేశ్యామ్ పీరియడ్ లవ్ స్టోరితో తెరకెక్కింది. 1970 కాలంలో యూరప్ లో జరిగిన ప్రేమకథగా తెరపై కనిపిస్తుంది. రాధే శ్యామ్ 14 జనవరి 2022 న దేశవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. తెలుగు-హిందీతో పాటు పలు భాషల్లో అనువాదమై విడుదలవుతుంది.
DDLJ ప్రేమికులు అనుకుంటే.. !
రాధేశ్యామ్ ప్యూర్ లవ్ స్టోరి. మెజార్టీ పార్ట్ షూటింగ్ అంతా ఇటలీ అందాల నడుమ జరిగింది. అక్కడా ప్రత్యేకంగా కొన్ని అద్భుతమైన సెట్లు వేసి తెరకెక్కించారు. అన్నింటిని మించి ప్రభాస్ - పూజా నడుమ రొమాంటిక్ లవ్ స్టోరీ హైలైట్ కాబోతుందని ఇప్పటికే కథనాలు వేడెక్కిస్తున్నాయి. ఇటలీ అందాల నడుమ DDLJ రేంజులో రొమాన్స్ కుదిరిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అసాధారణ ప్రేమకావ్యం `దిల్ వాలే దుల్హానియా లేజాయేంగే` (డీడీఎల్ జే)ని యూరప్ లోని స్విట్జర్లాండ్ అందాల నడుమ తెరకెక్కించారు. షారూక్- కాజోల్ ఈ చిత్రంలో ప్రేమికులుగా నటించిన సంగతి తెలిసిందే.
ఇక రాధేశ్యామ్ కి డీడీఎల్ జే లవ్ ఫీల్ ని రాధాకృష్ణ యాడ్ చేశారని గుసగుసలు ఇప్పుడు స్ప్రెడ్ అవుతున్నాయి. డార్లింగ్ ప్రభాస్- పూజా హెగ్డే ల మధ్య 1975 కాలానికి తీసుకెళ్లి...ఆ జంట మధ్య ఇటలీ రొమాంటిక్ సన్నివేశాలు చిత్రీకరించిన సంగతి తెలిసిందే. ఆ సన్నివేశాల కోసం... పాటల చిత్రీకరణ కోసమే కోట్లాది రూపాయలు వెచ్చించారు. పాటల చిత్రీకరణలో పూజా హెగ్డే..ప్రభాస్ ధరించిన కాస్ట్యూమ్స్ ని బట్టి సినిమాలో లవ్ స్టోరీకి ఎంత ప్రాధాన్యత ఉందో తెలుస్తోంది. రొమాంటిక్ సన్నివేశాల్లో ఎంత మాత్రం ఫీల్ మిస్ కాకుండా రక్తికట్టేలా వాస్తవాన్ని ప్రతిబింబించేలా రియలిస్టిక్ గానే ఆయా సన్నివేశాల్లో నటించినట్లు సమాచారం. సినిమాలో ఈ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్ణణగా నిలుస్తాయని వినిపిస్తోంది. అయితే ఇంత గొప్ప ప్రేమకథలో నటించినా ఆ ఇద్దరి మధ్యా కలతలు మొదలయ్యాయా? అసలేమైంది? అంటూ ఇప్పుడు అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఇంతలోనే యువి సంస్థ వివరణ ఇచ్చింది.