పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా చుట్టూ తాజాగా కొత్త రూమర్ లు పుట్టుకొస్తున్నాయి. వివరాల్లోకి వెళితే... కరోనా , ఒమిక్రాన్ విజృంభిస్తున్న కారణంగా చలా వరకు భారీ చిత్రాల రిలీజ్ లు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇందులో ముందుగా జక్కన్న రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన `ఆర్ ఆర్ ఆర్` జనవరి 7న విడుదల కావాల్సి వుంది. కానీ దేశ వ్యాప్తంగా మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఈ మూవీ రిలీజ్ ని మేకర్స్ అర్థాంతరంగా వాయిదా వేసిన విషయం తెలిసిందే.
ఈ మూవీ తరువాత ప్రభాస్ నటించిన `రాధేశ్యామ్` జనవరి 14న విడుదల కావాల్సింది. అయితే `ఆర్ ఆర్ ఆర్` తరహాలోనే ఈ మూవీని రిలీజ్‌ని కూడా వాయిదా వేయాల్సి వచ్చింది. దీంతో సంక్రాంతి బరిలో గట్టి పోటీ వుంటుందని, భారీ చిత్రాలని సిల్వర్ స్క్రీన్ పై చూడొచ్చిన ఆశగా ఎదురుచూసిన ప్రేక్షకులకు ఈ రెండు చిత్రాలు నిరాశని మిగిల్చాయి. అయితే తాజాగా `ఆర్ ఆర్ ఆర్` ని మార్చి లేదా ఏప్రిల్ లో రిలీజ్ చేస్తామంటూ మేకర్స్ ప్రకటించారు కానీ `రాధేశ్యామ్` నుంచి మాత్రం ఎలాంటి అప్ డేట్ వినిపించడం లేదు.
ఈ నేపథ్యంలో `రాధేశ్యామ్` ఓటీటీ రిలీజ్ అంటూ కొత్త రూమర్స్ పుట్టుకొస్తున్నాయి. `సాహో` చిత్రం విడుదలై రెండేళ్లు కావస్తున్నా ప్రభాస్ సినిమా థియేటర్లలోకి రాకపోవడంతో ఆయన అభిమానులు `రాధేశ్యామ్` కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ప్రేమ, విధి నేపథ్యంలో ప్రపంచంలో అత్యంత మిస్టరీగా మిగిలిన ఇటలీ ట్రైన్ మిస్సింగ్... డ్యావిన్సీ ఓడ ప్రమాదాలని ఈ కథకు జోడించి దర్శకుడు సరికొత్త ప్రేమకథగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
దీంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలని ఇటీవల విడుదల చేసిన ఈ చిత్ర ట్రైలర్ మరింత పెంచేసింది. ట్రైలర్ లోని సన్నివేశాలు హాలీవుడ్ చిత్రాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా వుండటంతో సినిమాని థియేటర్లలో చూస్తేనే థ్రిల్ వుంటుందని ప్రతీ ప్రేక్షకుడు భావిస్తున్నాడు. మేకర్స్ కూడా ఇది ఓటీటీలో చూసే సినిమా కాదని థియేటర్ లోనే దీన్ని చూసి తీరాలని చెబుతున్నారు. అయితే తాజాగా ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ కాబోతోందంటూ కొత్తగా వార్తలు షికారు చేయడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
గతంలో ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ 340 కోట్లకు మించి ఈ చిత్రానికి ఆఫర్ చేసిందట. కానీ మేకర్స్ మాత్రం మరో 50 కోట్లు కలపి ఇస్తేనే `రాధేశ్యామ్`ని ఓటీటీకి అప్పగిస్తామన్నారట. అందుకు అమెజాన్ వర్గాలు అంగీకరించకపోవడంతో ఈ డీల్ క్యాన్సిల్ అయిందని, తిరిగి అదే డీల్ పై ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే అధికారికంగా ప్రకటన రావచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలపై `రాధేశ్యామ్` మేకర్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.
ముందు నుంచి ఇది థియేటర్లలో చూసి అనుభూతి పొందాల్సిన సినిమా అని చెబుతున్న మేకర్స్ మరోసారి అదే విషయాన్ని స్పష్టం చేస్తారని, సినిమాని ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటీటీలో రిలీజ్ చేయరని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.