ప్రతి పురుషుడి విజయం వెనుక ఓ ఆడది ఉంటుంది అంటారు. మహేష్ బాబు విజయాల వెనుక నమ్రత శిరోద్కర్ ఉన్న మాట వాస్తవం. మహేష్ బాబు ముందు నుంచి స్టారే కానీ.. నమ్రతను పెళ్లాడాక సూపర్ స్టార్ అయిపోయాడు. అతడి బ్రాండ్ వాల్యూ పెరిగింది. అతడి సినిమాల స్థాయి పెరిగింది. మిగతా హీరోలెవ్వరికీ సాధ్యం కాని రీతిలో భారీగా సంపాదిస్తున్నాడు మహేష్. ఇందులో నమ్రతకు చాలానే క్రెడిట్ ఉంది. ఐతే అలాగని మహేష్ కు సంబంధించిన ప్రతి మంచి విషయాన్నీ ఆమెకే ముడిపెట్టయడమూ సరి కాదు. తాజాగా బ్రహ్మోత్సవం సినిమా యుఎస్ రైట్స్ రూ.13 కోట్లు పలకడం వెనుక కూడా నమ్రతతే మాస్టర్ మైండ్ అంటూ ఆమెను ఊరికే పొగిడేస్తున్నారు జనాలు.
నిజానికి అది శుద్ధ అబద్ధం. ‘బ్రహ్మోత్సవం’ పూర్తిగా పీవీపీ వాళ్ల సినిమా. బిజినెస్ డీలింగ్స్ అన్నే వాళ్లే చూసుకుంటున్నారు. మహేష్ బాబు గత సినిమా ‘శ్రీమంతుడు’ బ్లాక్ బస్టర్ హిట్టవడం.. మహేష్ బాబుకు బేసిగ్గానే యుఎస్ లో మంచి మార్కెట్ ఉండటంతో టాలీవుడ్ లోనే ఏ సినిమాకూ దక్కని స్థాయిలో ‘బ్రహ్మోత్సవం’ను రికార్డు ధరకు ఓ డిస్ట్రిబ్యూటర్ సొంతం చేసుకున్నాడు. పోటీలో భాగంగానే ఈ రేటు దక్కింది. అంత మాత్రాన దాన్ని నమ్రత అకౌంట్లోకి వేసేసి.. ఆమెను ఆకాశానికెత్తేయడం కరెక్ట్ కాదు. విరాట్ కోహ్లి ఫెయిలైతే అనుష్కను తిట్టిపోసినట్లు.. మహేష్ కు సంబంధించిన ప్రతి మంచి విషయాన్ని నమ్రతకు ముడిపెట్టే అలవాటు వదిలేస్తే బెటరేమో.