నయనతార మళ్లీ ఫెయిలైపోయిందట

Update: 2016-06-12 13:30 GMT
ఏంటో నయనతార. ఆమె ఎప్పుడు లవ్‌ లో పడినా.. చాలా డీప్ అన్నట్లే ఉంటుంది. కానీ చివరికి ఆమె ప్రేమ పెటాకులు అవుతుంది. కెరీర్ ఆరంభంలో శింబుతో ఆమె లవ్ స్టోరీ ఎంత పెద్ద హిట్టో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఈ రోజో రేపో వీళ్లిద్దరి పెళ్లి అనుకుంటున్న టైంలో ఉన్నట్లుండి ఇద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయి. నయనతారే శింబుకు దూరంగా వచ్చేసింది. ఆ చేదు అనుభవాన్ని మరిచిపోయి మళ్లీ సినిమాల్లో బిజీగా అయిపోయినట్లు కనిపించింది కానీ.. మళ్లీ ప్రభుదేవాతో ఎఫైర్ మొదలుపెట్టింది. ఇదెంత డీప్ అయిందంటే.. ప్రభు కోసం తన మతాన్నే మార్చుకుంది నయన్.

ప్రభుదేవా పేరును చేతి మీద పచ్చబొట్టు వేయించుకుని.. తానిక సినిమాల్లో నటించనని నిర్మాతలందరికీ చెప్పేసి.. పెళ్లికి రెడీ అయిపోయిన టైంలో మళ్లీ అక్కడ కూడా ఏదో తేడా కొట్టింది. ఆ ప్రేమకథ కూడా అటకెక్కేసింది. ఇలాంటి రెండుసార్లు ప్రేమలో దెబ్బ తిన్నాక నయన్ ఇంకోసారి ప్రేమలో పడే అవకాశమే ఉండదనుకున్నారంతా. కానీ తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్‌ తో కుచ్ కుచ్ హోతా హై అయిపోయింది. అతడితో కూడా త్వరలోనే పెళ్లి అనుకుంటుండగా.. మళ్లీ నెగెటివ్ వార్తలు వినిపిస్తున్నాయి. విఘ్నేష్ కూడా నయన్ కు ఇప్పుడు నచ్చట్లేదని.. అతడికి కూడా ఆమె టాటా చెప్పేసిందని కోలీవుడ్లో గుసగుసలాడుకుంటున్నారు. కొంత కాలంగా ఇద్దరూ ఎక్కడా కలిసి కనిపించకపోవడం కూడా ఈ రూమర్లకు బలం చేకూరుస్తోంది. మూడుసార్లు ప్రేమలో ఫెయిలైన నయన్.. ఇక పెద్దలు చూసిన సంబంధమేదో చూసుకుని పెళ్లి చేసుకుంటే బెటరేమో.
Tags:    

Similar News