ఇంటెలిజెంట్ ఈ ఏడాది అతి భారీ డిజాస్టర్ మూవీగా చెప్పుకోవచ్చు. స్టార్ డైరెక్టర్... స్టార్ హీరో... స్టార్ ప్రొడ్యూసర్... ఈ ముగ్గురి కాంబినేషన్లో వచ్చి కనీసం ఆడకుండా వెళ్లిపోయింది సినిమా. మొదటి రోజు టాక్ తరువాత ఆ సినిమాను ప్రమోట్ చేయడానికి కనీసం చిత్రయూనిట్ ప్రయత్నం చేయలేదంటే అర్థం చేసుకోవచ్చు. సాయి ధరమ్‌కు ఆ సినిమా విడుదలైన రాత్రి కాళరాత్రే అయినట్టు సమాచారం. మరి అంతలా అట్టర్ ఫ్లాపయిన సినిమా... నిర్మాతకు ఎలాంటి అనుభవాన్ని మిగిల్చిందో తెలుసా? అంటే రూమర్లు మాత్రం కాస్త గట్టిగానే వినిపిస్తున్నాయి.
ఇంటెలిజెంట్ సినిమాకు సి. కళ్యాణ్ నిర్మాత. వినాయక్ మీద ఉన్న నమ్మకమో లేక తేజు మీద అతి నమ్మకమో కానీ... కళ్యాణ్ ఆ సినిమా ఎవరికీ అమ్మకుండా అన్నిచోట్ల తానే విడుదల చేశాడు. దీంతో అతనికి అతి భారీగా నష్టం జరిగింది. కనీసం సినిమాకు పెట్టిన ఖర్చులో పావు శాతం కూడా వెనక్కి రాలేదు. దాదాపు 17 కోట్ల రూపాయల వరకు నష్టం వచ్చింది. ఆ నష్టాన్ని పూడ్చేందుకు మణికొండలో తనకున్న స్థలాన్ని అమ్ముకున్నాడని ఇప్పుడు రూమర్లు చెక్కెర్లు కొడుతున్నాయి. దాదాపు 20 కోట్ల రూపాయలకు ఆ స్థలాన్ని అమ్మినట్టు టాక్.
ఇంతలా ఇంటెలిజెంట్ కళ్యాణ్‌ని దెబ్బకొట్టేసిందని సన్నిహితులు వాపోతున్నారు. జీవితంలో ఆ సినిమా ఇచ్చిన అనుభవాన్ని మర్చిపోలేడు ఆ నిర్మాత అంటున్నారు సినీజనాలు. అయితే ఇందులో నిజానిజాలు మాత్రం సి.కళ్యాణ్ చెబితేనే తెలుస్తుందిలే.