సాహోని ఇంకా అమ్మలేదా ?

Update: 2019-08-23 07:45 GMT
ఇప్పటికే అంచనాలను ఎక్కడికో తీసుకెళ్ళిపోయిన సాహో విడుదలకు ఇంకా వారం రోజులు మాత్రమే ఉంది. ఇప్పటికే ఉన్న హైప్ కి అడ్వాన్స్ బుకింగ్స్ బద్దలు అవుతాయేమో అన్నంత వెయిటింగ్ జరుగుతోంది. థియేట్రికల్ బిజినెస్ పరంగా ఇప్పటికే రికార్డులు సృష్టించిన సాహో డిజిటల్ రైట్స్ ఇంకా అమ్మలేదని టాక్. అమెజాన్ ప్రైమ్ తో పాటు నెట్ ఫ్లిక్స్ విపరీతంగా పోటీ పడుతున్నాయని చాలా క్రేజీ డీల్ దక్కే అవకాశం ఉందని ఇప్పటికే చర్చ జరుగుతోంది.

మల్టీ లాంగ్వేజ్ మూవీ కాబట్టి హక్కులు సొంతం చేసుకుంటే చాలా రకాలుగా రెవిన్యూకి ఛాన్స్ ఉంటుంది. అందులోనూ రెండు వందల కోట్లకు పైగా తీసిన మోస్ట్ కాస్ట్లీ ఎంటర్ టైనర్. కాబట్టి రిజల్ట్ తో సంబంధం లేకుండా మిలియన్ల కొద్దీ వ్యూస్ ఈజీగా వస్తాయి. శాటిలైట్ హక్కులు సన్ నెట్ వర్క్ పొందినట్టుగా ఇప్పటికే లీక్ ఉంది కానీ దాన్ని మేకర్స్ నిర్ధారించలేదు. సుమారు 36 కోట్లకు తమిళ తెలుగు మలయాళం హక్కులు తీసుకున్నట్టుగా చెబుతున్నారు.

ఇది ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ కు రికార్డు మొత్తం. సాధారణంగా సన్ శాటిలైట్ తో పాటు నెక్స్ట్ పేరు మీద ఉండే  యాప్ ద్వారా డిజిటల్ స్ట్రీమింగ్ కు సైతం హక్కులు తీసుకుంటుంది. కానీ యువి చెప్పిన రేట్ విడిగా భారీగా ఉండటంతో టీవీ టెలికాస్ట్ కే పరిమితమవ్వాలని నిర్ణయం తీసుకుందట. మరి డిజిటల్ హక్కులు ఎవరి  చేతికి చిక్కుతాయో వేచి చూడాలి. 30న విడుదల కానున్న సాహోలో ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటించగా బాలీవుడ్ ఉద్దండులంతా విలన్లుగా కనిపించనున్నారు.


Tags:    

Similar News