వీడియో: సాహో మేకింగ్ ఠఫ్ టాస్క్
`సాహో`పై ఎన్ని విమర్శలు అయినా రానివ్వండి.. ఈ సినిమా యాక్షన్ సీన్స్ మాత్రం మైండ్ బ్లో అన్న టాక్ వినిపించింది. హాలీవుడ్ ప్రమాణాలకు ఏమాత్రం తగ్గని భారీతనంతో విజువల్స్ మతి చెడగొట్టాయి. దాదాపు 300 కోట్ల మేర వసూళ్లు దక్కించుకుంది అంటే ఈ భారీ యాక్షన్ కంటెంట్ వల్లనే. ఇందులో కథ ఉందా లేదా.. కన్ఫ్యూజ్ చేసిందా లేదా అన్నది కూడా పట్టించుకోకుండా అంత మంది ఆదరణ దక్కించుకుంది అంటే ఆషామాషీ కానేకాదు.
`సాహో` చిత్రం ఆద్యంతం ఒకదానిని మించి ఒకటిగా యాక్షన్ సీక్వెన్సుల్ని చూపించడానికి సుజీత్- కెన్నీ బేట్స్ బృందం చాలానే శ్రమించారని తాజాగా రిలీజైన మేకింగ్ వీడియో చెబుతోంది. ప్రతి యాక్షన్ సీన్ కోసం ముందే ఎంతో ప్రణాళికా బద్ధంగా స్కెచ్ లు వేసుకుని ఎంతో జాగ్రత్త తీసుకున్నారు. దుబాయ్ అబూదబీ సహా విదేశాల నుంచి రకరకాల కార్ లు- ట్రక్ లు- భారీతనం ఉన్న ట్యాంకర్లు రప్పించి ఒక ఫ్యాక్టరీనే తయారు చేశారు. ఎన్నో ఖరీదైన కార్లను యాక్షన్ సీన్ల కోసం నాశనం చేశారు. తాజాగా యువి క్రియేషన్స్ సంస్థ రిలీజ్ చేసిన సాహో మేకింగ్ వీడియోలో అవన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి.
సినిమా ఆద్యంతం యాక్షన్ సీన్ల కోసం ఏ స్థాయిలో శ్రమించాల్సి వచ్చిందో సుజీత్- ప్రభాస్- విదేశీ ఫైట్ కొరియోగ్రాఫర్లు స్వయంగా వివరణ ఇచ్చారు. ప్రీక్లైమాక్స్ లో దాదాపు 100 మంది విలన్లతో భారీ ఫైట్ సీన్ ని తెరకెక్కించారు. అలాగే కార్ క్రాష్.. ఆకాశంలోంచి ఊడిపడుతున్నట్టు కనిపించే ట్రక్ జంప్ ఇవన్నీ ఎలా తెరకెక్కించారో చూపించారు. వీటిని తిరిగి వీఎఫ్ ఎక్స్ లో ఎంతో అభివృద్ధి చేశాక.. ఫైనల్ ఔట్ పుట్ అంతే అద్భుతంగా కుదిరింది. రూ.200 ఖర్చు చేసి టిక్కెట్టు కొన్నారంటే ఈ యాక్షన్ సీన్లు చాలనుకునే ఆడియెన్ థియేటర్లకు వచ్చారనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా ఉత్తరాదిన సాహో బంపర్ హిట్ అవ్వడంతో ప్రభాస్ కి పాన్ ఇండియా స్టార్ గా ఉన్న ఇమేజ్ అసాధారణం అని ఇది మరోసారి ప్రూవ్ చేసిందనే అర్థం.
Full View