సాహో ఫోకస్ అక్కడే ఎందుకుంది?

Update: 2019-08-21 07:11 GMT
ఇంకో 9 రోజులు మాత్రమే ఉంది సాహో సంబరాలకు. ఇప్పటికే ప్రభాస్ ఫ్యాన్స్ గంటను ఒక యుగంలా గడిపేస్తూ ఎప్పుడెప్పుడు డార్లింగ్ హై వోల్టేజ్ యాక్షన్ చూద్దామా అనే ఆతృతలో ఉన్నారు. థియేటర్లు కూడా దానికి తగ్గట్టే ముస్తాబవుతున్నాయి. ఇదిలా ఉండగా ప్రభాస్ ముంబైలో పెద్ద క్యాంపే వేశాడు. నిన్న ఓ లైవ్ షోలో పాల్గొన్నాక సూపర్ హిట్ డాన్స్ ప్రోగ్రాం నచ్ బలియేలో శ్రద్ధా కపూర్ తో కలిసి గెస్ట్ గా అడుగు పెట్టాడు. అక్కడ జడ్జ్ తో వ్యవహరిస్తున్న రవీనాటాండన్ నుంచి వీళ్ళకు స్వీట్ వెల్కం దక్కింది.

దీని తాలుకు ఫోటో వైరల్ అయ్యింది. అయితే ప్రభాస్ ఇలా ముంబైలోనే ఉంటూ అక్కడి ప్రమోషన్స్ మీదే ఎక్కువ ఫోకస్ పెట్టడం గురించి సోషల్ మీడియాలో కామెంట్స్ రాకపోలేదు. ప్రభాస్ ఇక్కడి ఛానల్స్ కు మీడియాకు అందుబాటులో ఉండకుండా అక్కడేం చేస్తున్నాడనే రీతిలో కొందరు ప్రచారం చేయడంతో నిజమే కదా అనే తరహలో చర్చ జరుగుతోంది. వాస్తవానికి సాహోకి కాని సైరాకి కాని ప్రత్యేకంగా ఇక్కడ ఎలాంటి ఫోకస్ అటెన్షన్ అక్కర్లేదు. ఎలాగూ గ్రాండ్ గా ప్రీ రిలీజ్ చేశారు కాబట్టి ఇప్పటికే ఆకాశాన్ని అంటుతున్న హైప్ కి అది సరిపోతుంది.

కాని నార్త్ లో అలా కాదు. ఎంత బాహుబలి ఇమేజ్ ఉన్నా సాహో జోనర్ రెగ్యులర్ యాక్షన్ ఎంటర్ టైనర్ కిందకే వస్తుంది. అందులోనూ ఇలాంటి భారీ సినిమాలకు ఓపెనింగ్స్ చాలా కీలకం. మన హీరోల డబ్బింగ్ సినిమాలో లేదా స్ట్రెయిట్ మూవీసో చూసేందుకు అక్కడి ప్రేక్షకులను థియేటర్ల దాకా రప్పించాలంటే ఇవన్ని చేయక తప్పదు. అందుకే ప్రభాస్ ఇలాంటి ప్లానింగ్ తో వెళ్తున్నాడు తప్పించి వందల కోట్ల  బడ్జెట్ తో దేశవ్యాప్తంగా రిలీజ్ కు సిద్ధపడిన  విజువల్ వండర్ గురించి జాతీయ మీడియాలో చర్చ జరగాలంటే ఇదే సరైన మార్గం. అంతేతప్ప ప్రభాస్ లేదా సాహో టీం ఇక్కడెవరిని పట్టించుకోవడం లేదన్న మాట కరెక్ట్ కాదు


Tags:    

Similar News