ప్రభాస్ నటించిన `సాహో` రిలీజ్ కి సరిగ్గా ఇంకో 17 రోజులే మిగిలి ఉంది. ఆగస్టు 30 రిలీజ్ తేదీ. కౌంట్ డౌన్ స్టార్టయ్యింది కాబట్టి ఈ పదిహేను రోజులే ఏ ప్రచారం చేసినా. ప్రమోషన్స్ తో ముందు జనాల్లోకి దూసుకెళ్లాలి. అందుకు తగ్గట్టే భారీ షెడ్యూల్ ని ప్లాన్ చేసి సాహో బృందం ప్రణాళికా బద్ధంగా వెళుతున్న సంగతి తెలిసిందే. ఓవైపు సాహో .. మరోవైపు సాహో గేమ్ అంటూ సరికొత్త ప్రచారం మొదలు పెట్టింది సుజీత్ టీమ్. ఇదివరకూ సాహో గేమ్ పోస్టర్ రిలీజైంది. తాజాగా 67 సెకన్ల నిడివితో ఉన్న గేమ్ టీజర్ ని రిలీజ్ చేశారు. ఈ టీజర్ ఆద్యంతం అద్భుతమైన విజువల్స్.. రీరికార్డింగ్ తో మైమరిపిస్తోంది.
గేమ్ కోసం ప్రత్యేకించి క్యారికేచర్స్ ని అద్భుతంగా డిజైన్ చేశారు. ముఖ్యంగా ఈ గేమ్ ని లీడ్ చేసేది ప్రభాస్. భారీ భవంతుల నడుమ హెలీకాఫ్టర్లలో ఎదురొస్తున్న శత్రువుల్ని ఛేధిస్తూ గన్ ఫైరింగ్ చేస్తూ ఆ లీడ్ పాత్ర మూవ్ అవుతూ రక్తి కట్టించింది. ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఒక రియల్ సినిమా చూస్తున్నామా? అన్నంత క్యూరియాసిటీని ఇచ్చింది. అత్యంత ఎత్తైన భవంతి మీద నుంచి జెట్ ఆన్ చేసి శత్రువులపైకి దూసుకెళుతున్న ప్రభాస్ ని అద్భుతంగా చూపించారు. ముఖ్యంగా గన్ షాట్స్- ఫైరింగ్ మూవ్ మెంట్స్ ని చక్కగా యానిమేషన్ చేశారు. సాహో ట్రైలర్ తరహాలోనే ఈ గేమ్ ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఆగస్టు 15న `సాహో: ది గేమ్` మార్కెట్లో రిలీజవుతోంది.
ఇప్పటికే వీడియో గేమ్స్ కి భారతదేశంలో విశేష ఆదరణ దక్కుతోంది. `సాహో` గేమ్ కి అదే తీరుగా ఆదరణ దక్కుతుందనడంలో సందేహం లేదు. ప్రభాస్ ఫ్యాన్స్ లో ఎక్కువగా పిల్లలు.. యూత్ ఉన్నారు. అది కూడా ఈ గేమ్ ఆదరణ పెరగడానికి కారణమవుతుందనడంలో సందేహం లేదు.
Full View