కాబోయే భర్తపై లైంగిక వేధింపులు రావడంతో.. అప్పటికే పూర్తయిన నిశ్చితార్థం రద్దు చేసుకుంది ఓ హీరోయిన్. అయితే.. నిశ్చితార్థం ముందు రోజే ఈ విషయం తెలిసినప్పటికీ.. పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడింది. కానీ.. కొన్ని రోజుల తర్వాత తెగదెంపులు చేసుకోవడమే మంచిదనే నిర్ణయానికి వచ్చింది నటి. ఇది పొరుగు దేశం పాకిస్తాన్ లో జరిగింది.
పాక్ హీరోయిన్ సాబా కామర్.. పారిశ్రామికవేత్త అజీమ్ ఖాన్ ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైంది. ఇటీవల నిశ్చితార్థం కూడా చేసుకుంది. అయితే.. ఈ కార్యక్రమానికి ఒక రోజు ముందే.. ఓ యువతి అజీమ్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. తనకు నరకం చూపించాడని ఆరోపించింది.
అయితే.. ఇవేవీ పట్టించుకోని సాబా కామర్.. నిశ్చితార్థం యథావిధిగా జరుపుకుంది. ఆ తర్వాత తనలో మార్పు మొదలైందట. ఆలస్యంగా నిర్ణయం తీసుకున్నా.. మంచి నిర్ణయం తీసుకోవాలని భావించి, పెళ్లి రద్దు చేసుకోవడమే మంచిదని భావించిందట సాబా. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టింది.
‘నా పెళ్లి రద్దు విషయాన్ని మీ అందరికీ తెలుపుతున్నాను. కొన్ని కారణాల వల్ల నిశ్చితార్థం రద్దు చేసుకుంటున్నాను. గతంలో పలు సందర్భాల్లో నాకు మద్దతుగా ఉన్నారు. ఇప్పుడు కూడా నాకు అండగా ఉండండి’ అంటూపోస్టు చేసింది.
అయితే.. అజీమ్ ఖాన్ కూడా ఈ ప్రకటనపై స్పందించాడు. సాబా కారమ్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. తను ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నానని, తన జీవితంలో పరిపూర్ణమైన ప్రేమను, విజయాన్ని సొంతం చేసుకోవాలని ఆశిస్తున్నట్టు చెప్పాడు అజీమ్. ఈ బ్రేకప్ కు పూర్తి బాధ్యత తనదేనని చెప్పడం విశేషం. అయితే.. తనపై వచ్చిన లైంగిక ఆరోపణలను మాత్రం ఖండించాడు. తాను ఏ తప్పూ చేయలేదని ప్రకటించాడు.