మొదటి సినిమా 'జయం'తోనే మంచి విజయం అందుకున్న ముద్దుగుమ్మ సదాఫ్ ఖాన్ ఎలియాస్ సదా. ఆ సినిమా తర్వాత పలు చిన్న సినిమాలను చేసి అమ్మడు కొద్దీ కొద్దిగా కోలీవుడ్ కి కూడా పరిచయమై సంచలన దర్శకుడు శంకర్ దృష్టిలో పడి అపరిచితుడు లాంటి సినిమాలో విక్రమ్ సరసన నటించేందుకు ఛాన్స్ ని కొట్టేసింది. సాధరణంగా శంకర్ సినిమాల్లో హీరోయిన్స్ కి ప్రాముఖ్యత ఉంటుంది. ఆ సినిమాలో కూడా అమ్మడు నటనతో
గ్లామర్ తో ఆకట్టుకొని కొన్ని బారి ఆఫర్స్ ని దక్కించుకుంది.
కానీ ఏ సినిమాలూ అమ్మడికి అంతగా విజయాన్ని అందించలేదు. దీంతో అరకొరగా వచ్చిన సినిమాలనే చేసుకుంటూ ఇప్పటివరకు గ్లామర్ ప్రయత్నాలను కూడా చేస్తూనే ఉంది. అలాగే కొన్ని రియాలిటీ షోల్లో మెరిసి ఆదరణ బాగానే రాబట్టుకుంది. అయితే ఇప్పుడు ఆ ఛాన్సులు కూడా తగ్గుముఖం పట్టడంతో అమ్మడు కొత్త తరహా సినిమాలను ట్రై చేస్తోంది. రీసెంట్ గా 'టార్చ్ లైట్' అనే ఒక మలయాళ సినిమాని ఒకే చేసింది. 1980 నాటి నేపథ్యం కలిగిన ఈ కథలో అమ్మడు వేశ్యపాత్రలో కనిపించనుందట. కథ వినగానే సదాకి కళ్లలోనుండి నీళ్లు తిరిగాయట దీంతో ఏ మాత్రం ఆలోచించకుండా ఒకే చెప్పేసిందట.
ప్రస్తుతం తిరునల్వేలి - కుట్రాలం పరిసరాల్లో గ్రామాల్లో ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది. అబ్దుల్ మజిత్ అనే యువ దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. సినిమాలో ఆ కాలానికి సంబదించిన సెట్స్ విషయంలో యూనిట్ సభ్యులు తెగ కష్టపడుతున్నారట. ఇక సదా పాత్ర ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యేలా ఉంటుందని వారు చెబుతున్నారు.