వైరల్ వీడియో: సద్గురుతో టాప్ హీరో డ్యాన్స్
బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ అందరికీ షాక్ ఇచ్చాడు. ఐఐఎం బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో ఆధ్యాత్మిక గురువు సద్గురుతో డ్యాన్స్ చేయించి సంచలనం సృష్టించాడు. రణవీర్-గురు సద్డురు కలిసి డ్యాన్స్ చేసిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
బెంగళూరు ఐఐఎంలో జరిగిన కార్యక్రమానికి బాలీవుడ్ హీరో రణవీర్ - సద్గురులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రణవీర్ తన ఎనర్జీతో పాటలకు స్టెప్పులేస్తూ అక్కడి ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. ఈ సమయంలోనే వేదికపై కూర్చున్న సద్గురు వచ్చి రణవీర్ తో పాదం కలపడం అందరినీ సంభ్రమాశ్చార్యాలకు గురిచేసింది. ఈ పరిణామంతో వేదిక మొత్తం చప్పట్లు - ఈలలతో దద్దరిల్లింది. సద్గురు-రణవీర్ ఒకరిని హత్తుకొని ఒకరు కలిసి డ్యాన్స్ చేయడం ఉర్రూతలూగించింది.
ప్రస్తుతం రణవీర్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. జోయా అక్తర్ దర్శకత్వంలో ‘గుల్లీ బాయ్’ చిత్రంలో నటిస్తున్నాడు. ఇదేకాకుండా రోహిత్ శెట్టి దర్శకత్వంలో ‘సింబ’ మూవీలోనూ చేస్తున్నాడు. రీసెంట్ గానే సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వచ్చిన ‘అల్లావుద్దీన్ ఖిల్జీ’ మూవీతో రణవీర్ హిట్ కొట్టి జోష్ మీదున్నాడు.
వీడియో కోసం క్లిక్ చేయండి
Full View