మన నాటు నాటు ఇప్పుడు ప్రపంచాన్ని డాన్స్ చేసేలా చేస్తుంది. దేశం.. భాష తో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు మరియు సంగీత ప్రేమికులు నాటు నాటు పాటను ఎంజాయ్ చేస్తూ స్టెప్స్ తో కవర్ వీడియోలను చేస్తున్నారు.
ఇప్పటికే హాలీవుడ్ స్టార్స్ నుండి ఎన్నో దేశాల సినీ స్టార్స్ నాటు నాటు స్టెప్స్ వేసి సర్ ప్రైజ్ చేసిన విషయం తెల్సిందే. ఇప్పుడు ఇండియాలోని కొరియన్ రాయబారి టీమ్ సందడి చేసింది.
ఆస్కార్ అవార్డ్ కు నామినేట్ అయిన నాటు నాటు పాటకు కొరియన్ రాయబారి టీమ్ వేసిన డాన్స్ ను ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సద్గురు రీ ట్వీట్ చేసి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన ట్విట్టర్ లో... నాటు నాటు పాటకు ప్రపంచం యావత్తు డాన్స్ చేస్తుంది. ఆర్ఆర్ఆర్ టీమ్ కు అభినందనలు. కొరియన్ రాయబారి టీమ్ నాటు నాటు పాటకు డాన్స్ చేశారు. వారికి కూడా నా అభినందనలు అంటూ వీడియోను సద్గురు షేర్ చేశాడు.
ఆస్కార్ వేదికపై నాటు నాటు పాట సందడి చేయబోతున్న విషయం తెల్సిందే. ఈ సమయంలో ఇలా అంతర్జాతీయ స్థాయిలో పాటను రకరకాలుగా డాన్స్ లు చేస్తూ మరింతగా వైరల్ అయ్యేలా చేస్తున్నారు. ఈ స్థాయిలో పబ్లిసిటీ దక్కించుకుని.. పాపులారిటీ సొంతం చేసుకున్న నాటు నాటు పాట ఆస్కార్ అవార్డు విన్నింగ్ కు కచ్చితంగా అర్హం అంటూ ప్రతి ఒక్కరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కీరవాణి స్వరపరచిన ఈ పాటను రాజమౌళి అద్భుతంగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. చంద్రబోస్ సాహిత్యం అందించగా నాటు నాటు స్టెప్స్ తో రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లు అదరగొట్టారు. పాటలోని ప్రతి షాట్ కూడా ఒక అద్భుతం అన్నట్లుగా ఉంటుంది.. అందుకే ఈ పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ నామినేషన్ దక్కింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

World dances to Naatu Naatu! Congratulations to the #RRR team and to the Ambassador of the Republic of Korea & his team for shaking their leg to Naatu Naatu! -Sg @RokEmbIndia@AlwaysRamCharan @tarak9999 @ssrajamouli https://t.co/s2MWiSEpai
— Sadhguru (@SadhguruJV) February 28, 2023