మెగా మేనల్లుడి చందమామ

Update: 2018-04-04 07:47 GMT
ఇంటెలిజెంట్ ఇచ్చిన షాక్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సుప్రీమ్ హీరో సాయి ధరం తేజ్ తన ఆశలన్నీ దర్శకుడు కరుణాకరన్ రూపొందిస్తున్న కొత్త సినిమా మీదే పెట్టుకున్నాడు. క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ పై సీనియర్ నిర్మాత కెఎస్ రామారావు నిర్మిస్తున్న ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ హీరొయిన్. హడావిడి లేకుండా షూటింగ్ పూర్తి చేసేసుకుంటున్న ఈ సినిమాకు టైటిల్ ఫిక్స్ చేసినట్టు తాజా సమాచారం. ‘అందమైన చందమామ’ అనే పేరుని ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేసినట్టు టాక్. టైటిల్ చూస్తే ఇదేదో హీరొయిన్ ని ఉద్దేశించి పెట్టినట్టుగా అనిపిస్తోంది. ఇప్పటి దాకా కేవలం మాస్ ని మాత్రమే టార్గెట్ చేస్తూ ఒకే తరహా సినిమాలు చేసుకుంటూ వచ్చిన సాయి ధరం తేజ్ దీంతో రూట్ మార్చినట్టే కనిపిస్తోంది.

యూనిట్ నుంచి ఇది అధికారిక ప్రకటన రూపంలో త్వరలోనే రానుంది. సాయి ధరం తేజ్ కు ఇది హిట్ కావడం చాలా కీలకం. దర్శకుడు కరుణాకరన్ ఈ మధ్య ఫాంలో లేనప్పటికీ సరైన కథ దొరికింది కనక పవన్ కళ్యాణ్ తొలిప్రేమ మేజిక్ మళ్ళి దీంతో రిపీట్ చేస్తానంటున్నాడు. చాలా అరుదుగా సినిమా నిర్మాణం చేస్తున్న కెఎస్ రామారావు ఇది టేకప్ చేయటం కూడా సినిమా పట్ల అంచనాలు పెంచుతోంది. అందమైన చందమామ అంటే పేరు క్యాచీగా హోమ్లీగా ఉండటంతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకునే అవకాశం ఉంది. అందుకే మెజారిటీ యూనిట్ మెంబెర్స్ దీనికే ఓటు వేసారని ఇన్ సైడ్ టాక్.

మెగా కాంపౌండ్ వరసగా రెండు సక్సెస్ లతో జోష్ మీదుంది. వరుణ్ తేజ్ తొలిప్రేమ హిట్ అయితే రామ్ చరణ్ తేజ్ రంగస్థలం బ్లాక్ బస్టర్ కావడంతో నా పేరు సూర్య కోసం ఫాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇది అయ్యాక వచ్చే సినిమా సాయిదే అవుతుంది. ఈ చెయిన్ ఇలాగే కంటిన్యూ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ నెలాఖరులోపు షూటింగ్ పూర్తి చేసి వచ్చే రెండు నెలల్లో ఒక డేట్ ని డిసైడ్ చేయబోతున్నారు.

Tags:    

Similar News