మెగాస్టార్ కథను పట్టాడా?

Update: 2018-05-23 06:32 GMT
మెగా హీరోల్లో ప్రస్తుతం అందరు బాక్స్ ఆఫీస్ హిట్స్ తో దూసుకుపోతున్నారు. కానీ సాయి ధరమ్ మాత్రం ఇంకా వరుస డిజాస్టర్స్ తోనే సతమతమవుతున్నాడు. ఎన్ని సినిమాలు చేస్తున్నా కూడా ఆడియెన్స్ నుంచి కనీసం రెస్పాన్స్ రావడం లేదు అంటే మనోడి ట్రాక్ సరిగ్గా వెళ్ళడం లేదు అని కామెంట్స్ వచ్చాయి. అందుకే రొటీన్ కి భిన్నంగా వెళ్ళాలి అని సాయి ధరమ్ తేజ్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కరుణాకరన్ దర్శకత్వంలో లవర్ బాయ్ క్యారెక్టర్ చేస్తున్నాడు.

తేజ్ ఐ లవ్ యూ అనే ఆ సినిమా పై మొదటి లుక్ తోనే పాజిటివ్ వైబ్రేషన్స్ పెరిగాయి. ఇక ఆ సంగతి పక్కనపెడితే సాయి ఇటీవల కిషోర్ తిరుమల చెప్పిన ఓ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆ విషయం అందరికి తెలిసిందే. అయితే ఆ కథ మెగాస్టార్ గతంలో చేసిన చంటబ్బాయ్ తరహాలో ఉంటుందని టాక్. 1986 లో వచ్చిన ఆ సినిమాను హాస్య దర్శకులు జంధ్యాల గారు తెరకెక్కించారు. మెగాస్టార్ కి సరికొత్త ఇమేజ్ తెచ్చి పెట్టిన ఆ సినిమా కథనే ఇప్పుడు సాయి కూడా ట్రై చేస్తాడట.

ఇప్పటికే మెగా స్టార్ పాటలను మనోడు బాగా వాడేశాడు. సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా కూడా ఏ మాత్రం తగ్గడం లేదు. ఇక ఈ సారి ఏకంగా మెగా కథని తీసుకోవడం సాహసమనే చెప్పాలి. అందులో మెగాస్టార్ కామెడీ టైమింగ్ కి పెరు పెట్టలేము. మరి సాయి ధరమ్ తేజ్ కూడా ఆ తరహాలో చేస్తాడా లేదా అనేది చూడాలి. కిషోర్ తిరుమల నేను శైలజా సక్సెస్ తరువాత ఉన్నది ఒకటే జిందాగి సినిమా చేసి ఫెయిల్యూర్ ని అందుకున్నాడు. మరి ఈ సినిమాతో అయినా సెట్ అవుతాడో లేదో చూడాలి.
Tags:    

Similar News