ఎప్పుడు లోకల్ కథలు వర్కవుట్ అవ్వవో అప్పుడే మనోళ్ళు పక్క రాష్ట్రాల నుండి కథలు అరువు తెచ్చుకుంటుంటారు. ఇప్పుడు ఏకంగా మెగా ఫ్యామిలీ అంతా ఇదే పంథాలో ఉన్నారు. చిరంజీవి - పవన్ - చరణ్.. ముగ్గురూ రీమేక్ బాటలోనే నడుస్తున్నారు. కట్ చేస్తే.. అసలు ఈ మధ్య కాలంలో వీరందరికంటే ముందు సాయిధరమ్ తేజ్ ఈ పంథాలో నడవాలి.
కన్నడలో హిట్టయిన మిష్టర్ అండ్ మిసెస్ రామాచారి సినిమాను సాయిధరమ్ తెలుగులో రీమేక్ చేస్తాడనే వార్తను విని ఒక ఏడాది కాలం అయ్యింది. అప్పట్లో ఎన్.ఎస్.రాజ్ కుమార్ అనే ఓ నిర్మాత.. 'మైనా' 'మైత్రి' వంటి సినిమాలను తీశాక.. ఈ కన్నడ సినిమాను తెలుగులో తీయడానికి రెడీ అంటూ రామాచారి సినిమా 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంలో చెప్పాడు. ఈ సినిమాను సాయిధరమ్ తో రీమేక్ చేయాలనుకుంటున్నాం అంటూ కామెంట్లు చేశారు. కాని ఇంతవరకు అది మెటీరియలైజ్ కాదు.
ఇప్పుడు లేటెస్టుగా ఫిలిం నగర్ లో వినిపిస్తున్న గాసిప్ ఏంటంటే.. ఈ ఏడాది కాలంనాటి న్యూస్ ఇప్పుడు నిజం అవ్వోబోతోందని. సర్లేండి.. సంవత్సరం నుండి చెబుతున్నారు కాబట్టి.. ఇప్పుడు దీన్ని నమ్మే పరిస్థితుల్లో ఎవ్వరూ లేరు. ఒకవేళ మూవీ లాంచ్ అయితే నమ్మకం కుదురుతుంది. ఇంకో పంచ్ ఏంటంటే.. ఇప్పటికే సదరు కన్నడ సినిమా స్టోరీ లైన్ లో చాలా సీన్లు దొబ్బేసి.. మన తెలుగు సినిమాల్లో వాడేశారు కూడా.