వరుసగా నాలుగు డిజాస్టర్స్ తరువాత వస్తోన్న సాయి ధరమ్ తేజ్ ఇప్పుడు ఇంటిలిజెంట్ పై కాస్త నమ్మకంగానే ఉన్నాడు. దర్శకుడు వివి.వినాయక్ ఖైదీ నెంబర్ 150 తరువాత ఫెయిల్యూర్ లో ఉన్న హీరోతో తీస్తున్నప్పటికి హీరోకి తగ్గట్టుగా సినిమా ఉంటుంది అని చెబుతూ తప్పకుండా హిట్ అవుతుంది అంటున్నాడు. సాయి ఇందులో సాఫ్ట్ వేర్ ప్రొఫెషనల్ గా ధర్మా భాయ్ అనే పాత్రలో కనిపించనున్నాడు. ఫిబ్రవరి 9న శుక్రవారం ఈ సినిమా రిలీజ్ కాబోతోన్న సంగతి తెలిసిందే.
రీసెంట్ గా ఫైనల్ కాపీని మరో సారి చూసిన వినాయక్ ఫుల్ కాన్ఫిడెంట్ తో ఉన్నాడట. ఇక అసలు విషయానికి వస్తే..ఈ సినిమా నిజజీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా తెరకెక్కిందని చిత్ర యూనిట్ ముందే చెప్పింది. 2014లో కూకట్ పల్లి రింగ్ రోడ్ లో జరిగిన ఓ ఘటన ప్రభావం కథలో ఉంటుందట. ఇక ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు వినాయక్ మరొక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పాడు. 2011 - 2016 మధ్యకాలంలో హైదరాబాద్ లో ఉగ్రవాదం సృష్టించిన క్రూరమైన నేర ముఠా 'స్నేక్ గ్యాంగ్' ఆధారంగా ఉంటుందని తెలిపాడు. ఈ గ్యాంగ్ వారు పాముతో కాటేయిస్తాం అని బెదిరించి దాదాపు 25 జంటలను కొట్టి.. అమ్మాయిలను రేప్ చేసినట్లు ఆధారాలున్నాయి.
విలన్ హీరోల మధ్య వచ్చే మైండ్ గేమ్ సీన్స్ సినిమాలో హైలెట్ గా నిలవనున్నాయట. వినాయక్ తన రెగ్యులర్ ఫార్మాట్ లా కాకుండా కొన్ని సీన్స్ లలో ప్రయోగాలు చేశాడని తెలుస్తోంది. ఇక సినిమా మరికొన్ని గంటల్లో అమెరికా లో ప్రీమియర్స్ ద్వారా రిలీజ్ కాబోతోంది. మరి సినిమా అన్ని ఏరియాల్లో పాజిటీవ్ టాక్ ను అందుకుంటుందో లేదో చూడాలి.