ఓవైపు దిల్ రాజు అండగా నిలిచాడు. ఇంకోవైపు కొరటాల సపోర్ట్ ఇచ్చాడు. ఇంకా హరీష్ శంకర్ కూడా తన వంతుగా తోడ్పాటు అందించాడు. వీళ్లు కాక హీరో సాయిధరమ్ తేజ్.. దర్శకుడు బి.వి.ఎస్.రవి.. నిర్మాత కృష్ణ.. ఈ ముగ్గురికీ సన్నిహితులైన అనేకమంది ‘జవాన్’ కోసం తమ వంతు సాయం చేసినట్లే చెబుతున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితం అందుకుంటుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. సాయిధరమ్ తేజ్ హ్యాట్రిక్ ఫ్లాపుల మీద ఉండటం.. బి.వి.ఎస్.రవి దర్శకుడిగా తీసిన తొలి సినిమా దారుణ ఫలితాన్ని అందుకోవడం.. దీనికి తోడు సరైన ప్రచారం చేయకపోవడం వల్ల ఈ సినిమాపై మొదట్నుంచి ఏమంత పాజిటివ్ బజ్ అయితే లేదు. ఒక్క టీజర్.. కొన్ని పాటలు రిలీజ్ చేస్తే.. ఎక్కడా కూడా ఏ స్పెషాలిటీ కనిపించలేదు.
ఇంకా దీని ట్రైలర్ రావాల్సి ఉంది. గురువారం రిలీజయ్యే ఆ ట్రైలర్ ఎలా ఉంటుందో చూడాలి. ఎప్పుడో ఆగస్టులో విడుదల కావాల్సిన సినిమా ‘జవాన్’. కానీ వాయిదాల మీద వాయిదాలు పడింది. రీషూట్లని.. మార్పులు చేర్పులని రకరకాల వార్తలొచ్చాయి. ఇవి సినిమా మీద జనాల్లో ఒక నెగెటివ్ ఇంప్రెషన్ కలిగించాయి. ఐతే ఇలాంటి మార్పులు చేర్పుల వల్ల ‘సోగ్గాడే చిన్నినాయనా’.. ‘రారండోయ్ వేడుక చూద్దాం’ లాంటి సినిమాలు మంచి ఫలితమే అందుకున్నాయి కాబట్టి.. వాటి వల్ల మంచి జరిగితే ఓకే. ఐతే ఈ సినిమాకు సరైన ప్రి రిలీజ్ బజ్ తీసుకురావడంలో అయితే చిత్ర బృందం సక్సెస్ కాలేదు. తమన్ ఒక్కడు ఈ సినిమా పాటల గురించి తన వంతుగా సోషల్ మీడియాలో ఉద్ధృతంగా ప్రచారం చేస్తున్నాడు. మిగతా టీం కూడా సినిమాను జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయాల్సిన అవసరముంది.