ఇది నా బ‌యోపిక్ కాదు

Update: 2019-04-11 05:16 GMT
సాయి తేజ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్రం `చిత్ర‌ల‌హ‌రి`. కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. నివేద పెథురాజ్ - క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ క‌థానాయిక‌లు. మైత్రి మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మించింది. ఈ శుక్ర‌వారం(12న‌) సినిమా రిలీజ్ కానుంది. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్ లో జ‌రిగిన పాత్రికేయ స‌మావేశంలో క‌థానాయకుడు సాయిధ‌ర‌మ్ తేజ్ పాత్రికేయుల‌తో ముచ్చ‌టించారు.

సాయి ధ‌ర‌మ్ తేజ్ ఆరు ఫ్లాప్ ల త‌ర్వాత న‌టించిన చిత్ర‌మిది. ఎట్టి ప‌రిస్థితిలో ఈసారి హిట్ కొట్టి తీరాల‌న్న క‌సితో ప‌ని చేశాడు. ఆ క్ర‌మంలోనే అత‌డి పేరు మార్పు గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. సాయిధ‌ర‌మ్ తేజ్‌ లో ధ‌ర‌మ్ తొల‌గించ‌డానికి కార‌ణ‌మేంటో నిన్న‌టి రోజున మీడియా ఇంట‌ర్వ్యూలో చెప్పిన అత‌డికి మ‌రో ఆస‌క్తిక‌ర ప్ర‌శ్న ఎదురైంది. చాలామంది సక్సెస్‌ కాని కుర్రాళ్లు `చిత్రలహరి` తమ బయోపిక్‌ లా ఫీలవుతున్నారు! దీనిపై మీ స్పందన ఏంటి? అని ప్ర‌శ్నిస్తే.. అత‌డి ఆన్స‌ర్ ఆస‌క్తి రేకెత్తించింది. సాయి తేజ్ మాట్లాడుతూ..`` చాలామంది ట్విట్టర్‌ - ఫేస్‌ బుక్‌ లో ఇది నా బయోపిక్‌ లా ఉందని పోస్ట్‌ చేస్తున్నారు. ప్రతి మనిషి జీవితంలో అలాంటి ఒక బ్యాడ్ ఫేజ్ ఉంటుంది. పోస్ట్‌ చేసిన ప్రతి ఒక్కరికీ అలాంటి అనుభ‌వాలు ఉండి ఉంటాయి. ఈ సినిమా వారందరికీ ఒక మంచి ఫీల్‌ ని ఇస్తుంద‌న‌డంలో సందేహం లేదు`` అన్నారు.

లైఫ్‌ లో సక్సెస్‌ సాధించలేకపోయిన వారికి ఈ సినిమా ద్వారా ఏమైనా సందేశం ఇస్తున్నారా? అని ప్ర‌శ్నిస్తే
ఈ సినిమాలో అలాంటి వారికోసం మంచి సందేశం ఉంది. తెర‌పై చూసుకుని ఎవ‌రికి వారు క‌నెక్ట‌వుతార‌ని తెలిపారు. ఈ చిత్రంలో నా పాత్ర‌ పేరు విజయ్‌ కృష్ణ. జీవితంలో ఎప్పుడూ సక్సెస్‌ చూడలేదు. సక్సెస్‌ అంటే ఏంటో కూడా తెలీదు. అలాంటి ఓ యువకుడు ఫెయిల్యూర్స్‌ ని అధిగమించి సక్సెస్‌ ని ఎలా సాధించాడు అనేది సినిమా కాన్సెప్ట్ అని తెలిపారు. వ‌రుస ఫ్లాప్ ల త‌ర్వాత స్క్రిప్టుల ఎంపిక‌పై జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారా? అన్న ప్ర‌శ్న‌కు న‌చ్చ‌క‌పోతే న‌చ్చ‌లేదు అని చెప్ప‌లేక‌పోయేవాడిని. తీరా సెట్స్ కెళ్లాకా త‌ప్పు జ‌రుగుతోంద‌ని తెలిసీ చెప్ప‌లేక‌పోయాను. కానీ ఇప్పుడు అలా లేను అని క్లారిటీగా చెప్పేశాడు. ఈ క్లారిటీతో ఇక‌పై వ‌రుస హిట్టు కొడ‌తాన‌న్న ధీమాను వ్య‌క్తం చేశాడు సాయిధ‌ర‌మ్.


Tags:    

Similar News