డిపెండబుల్‌ హీరో అయిపోతాడేమో!!

Update: 2016-05-23 17:30 GMT
ఒక సినిమా 1 వారం ఆడట్టానికే ఇక్కడ బిపి షుగర్‌ లు వచ్చేస్తుంటే.. అసలు కంటెంట్‌ సోసో గా ఉన్నా కూడా ''సుప్రీమ్‌'' సినిమా 3 వారాల రన్‌ కంప్లీట్‌ చేసుకోబోతోంది. కేవలం 18 రోజుల్లోనే సినిమా '20.27 కోట్లు' షేర్‌ వసూలు చేసింది. ఇప్పుడు ఈ ఫీట్‌ తో మెగా మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌ ఒక పొజిషన్‌ లో స్థిరంగా తన ప్రస్థానం కొనసాగిస్తున్నాడు అని చెప్పొచ్చు.

మన స్టార్‌ హీరోలైన పవన్‌ - మహేష్‌ - చరణ్‌ - బన్నీ - ఎన్టీఆర్‌ సినిమాలకు.. మినిమం 40 కోట్ల మార్కెట్ ఉంది. ఫ్లాపైనా కూడా వీరు ఆ నెంబర్‌ ను టచ్ చేస్తారు. ఇక హిట్‌ రేంజ్‌ మనం చెప్పలేం. ఎంతైనా కొట్టొచ్చు. ఆ తరువాత గ్రేడ్‌ లో ఉన్న హీరోలు ఎవరంటే.. మనకి రవితేజ.. గోపిచంద్‌.. నాని.. నితిన్‌ - రామ్‌.. వంటి హీరోల పేర్లు వినిపిస్తాయి. కాని విశేషం ఏంటంటే.. వీరందరూ 20 కోట్ల షేర్‌ బ్రాకెట్‌ లో ఉన్న హీరోలే. రవితేజ్‌ రేంజ్ పెంచుకోవచ్చు కాని.. ఆయన మూస సినిమాలతోనే సరిపెట్టేస్తున్నాడు. వీళ్ళలో నాని ఒక్కడే 25 కోట్ల మార్కును భలే భలే మగాడివోయ్‌ తో టచ్‌ చేసి.. ఆ తరువాత మళ్లీ కష్ణగాడి వీర ప్రేమగాధతో 10 కోట్లకు పడిపోయాడు. ఇక 10-15 కోట్ల లోపు ఉన్న హీరోల్లో చాలామందే ఉన్నారు.

అయితే వీళ్ళందరిలో స్టెడీగా అవుట్ పుట్ ఇస్తున్న హీరో సాయిధరమ్‌ తేజ్‌. పిల్లా నువ్వులేని జీవితంతో 10+ కోట్లు షేర్‌.. సుబ్రమణ్యం ఫర్ సేల్‌ తో 19.6+ కోట్లు.. సుప్రీమ్‌ తో 20.2+ కోట్లు షేర్‌ వసూలు చేసి.. ఒక కన్సిస్టెన్సీ చూపిస్తున్నాడు. ఇక తదుపరి వచ్చే సినిమా కూడా 20+ షేర్‌ వసూలు చేస్తే.. మనోడు నాని అండ్‌ రవితేజ ల కంటే పెద్ద డిపెండబుల్‌ హీరో అయిపోతాడేమో. కాదంటారా?
Tags:    

Similar News