స్కై జోన్ బ్రాండ్ అంబాసిడర్ గా తేజు

Update: 2017-03-18 06:43 GMT
సాయి ధరం తేజ్ కు ఆటలన్నా.. ముఖ్యంగా క్రికెట్ అన్నా ఎంత ఇష్టమో దాదాపు అందరికీ తెలిసిన విషయమే. అయితే.. ఈ మెగా హీరోకి ఎడ్వంచర్ స్పోర్ట్స్ అంటే ఇంకా ఎక్కువ ఇష్టమనే విషయం మాత్రం కొందరికే తెలుసు. యూఎస్ కేంద్రంగా పని చేసే ట్రాంపోలిన్ పార్క్ స్కై జోన్ కు బ్రాండ్ అంబాసిడర్ గా సంతకం పెట్టాడు ఈ సుప్రీం హీరో.

ప్రపంచవ్యాప్తంగా ఇన్ డోర్ ఫ్యామిలీ ఎంటర్టెయిన్మెంట్ సెంటర్స్ నడుపుతూ ఉంటుంది స్కై జోన్. యూఎస్.. కెనడా.. మెక్సికో.. ఆస్ట్రేలియా..  సౌదీ అరేబియా.. చైనా.. యూకే వంటి దేశాల్లో ఇప్పటికే 165 పార్క్ లను నిర్వహిస్తోంది ఈ కంపెనీ. హైద్రాబాద్ లో ఓ ట్రాంపోలిన్ పార్క్ ను ఏర్పాటు చేసేందుకు రెడీ అవుతోంది స్కై జోన్. దక్షిణాదిలో రామ్ ఎంటర్టెయన్మెంట్స్.. ఈ స్కైజోన్ పార్క్ లను ఏర్పాటు చేయనుంది. సాయి ధరం తేజ్ తో బ్రాండ్ అండార్స్ మెంట్ కుదుర్చుకున్న తర్వాత రామ్ ఎంటర్టెయిన్మెంట్స్ సీఈఓ.. రామ్ తాళ్లూరి ఆసక్తికరమైన విషయాలు చెప్పారు.

'ఎలాంటి సాహసాలు చేసేందుకు అయినా సిద్ధంగా ఉండే సాయి ధరం తేజ్ తో అసేసియేట్ కావడం ఆనందంగా ఉంది. వచ్చే రెండేళ్లలో దేశవ్యాప్తంగా 10 స్కై జోన్స్ ను ఏర్పాటు చేయనున్నాం. హైద్రాబాద్ లో గండిపేట్ లో ఒకటి.. శరత్ మాల్ లో మరొకటి ఏర్పాటు చేయనున్నాం. విశాఖ పట్నం.. చెన్నై.. బెంగళూరు.. కొచ్చిన్ నగరాల్లో ఒక్కొక్కటి చొప్పున 2018 నాటికి ఈ పార్కులను ప్రారంభిస్తాం. గండిపేటలో జూలై 2017 నాటికి మొదటి స్కై జోన్ ఏర్పాటు పూర్తవుతుంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద స్కై జోన్ గా అవతరించనంది' అని చెప్పారు రామ్ తాళ్లూరి.

స్కై క్లైంబ్.. ఫోమ్ జోన్.. వారియర్ కోర్స్.. ఆర్గాడూజీ.. వంటి ఎన్నో వినూత్నమైన ఆటలు ఇక్కడ ఏర్పాటు కానున్నాయి. సాయి ధరం తేజ్ తమ బ్రాండ్ కు ప్రచారం చేయడాన్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నట్లు స్కై జోన్ వర్గాలు చెబుతున్నాయి. తమ బ్రాండ్ వాల్యూను మరింతగా పెంచేందుకు.. తేజు సరైన వ్యక్తి అని చెబుతున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News