చిన్నా పెద్దా అని తేడా లేకుండా సరైన రిలీజ్ డేట్ ఎంచుకోవడంలో అన్ని సినిమాలూ ఇబ్బంది పడుతున్నాయి ప్రస్తుతం. పెద్ద పెద్ద సినిమాల నిర్మాతలకు కూడా రిలీజ్ డేట్ తలనొప్పులు తప్పట్లేదు. ఎంత ముందుగా బెర్తు బుక్ చేసుకున్నా.. పోటీ తప్పట్లేదు. బాలీవుడ్లో మాదిరి స్లాట్ పద్ధతి ప్రవేశపెట్టాల్సిన పరిస్థితి వచ్చేలా ఉంది టాలీవుడ్లోనూ. వచ్చే ఏడాది సంక్రాంతికి.. వేసవికి బెర్తులు ఆల్రెడీ బుక్ అయిపోయాయి. ఈ విషయంలో పెద్ద సినిమాల నిర్మాతల మధ్య కూడా విభేదాలు తలెత్తే పరిస్థితి నెలకొంది. ఇక మీడియం సినిమాల నిర్మాతలైతే ఏమాత్రం రాజీ పడట్లేదు. ఎవరికి వారు డేట్లు ఇచ్చేస్తున్నారు.
సంక్రాంతికి.. వేసవికి పోటీ పడటాన్ని కూడా అర్థం చేసుకోవచ్చు కానీ.. ఫిబ్రవరి నెలలో ఒక తేదీ కోసం మూడు సినిమాలు ఇప్పట్నుంచే కొట్టేసుకుంటుండటం ఆశ్చర్యమే. ముందుగా ఫిబ్రవరి 9కి సాయిధరమ్ తేజ్-వి.వి.వినాయక్ సినిమాను అనుకున్నారు. వాళ్లు రిలీజ్ డేట్ చూచాయిగా మీడియాకు చెప్పి సైలెంటయ్యారు. దీని గురించి మీడియాలో వార్తలొచ్చిన సంగతి తెలిసి కూడా వరుణ్ తేజ్ మూవీ ‘తొలిప్రేమ’ను కూడా అదే రోజు రిలీజ్ చేయబోతున్నట్లు నిర్మాత ప్రకటించేశాడు. ఈ మెగా పోరు గురించి ఆశ్చర్యపోతుండగానే ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా రేసులోకి వచ్చింది. శ్రీవాస్ దర్శకత్వంలో అతను నటిస్తున్న ‘సాక్ష్యం’ సినిమాను కూడా ఫిబ్రవరి 9కే ఫిక్స్ చేశారట. మరి ఫిబ్రవరి లాంటి అన్ సీజన్లో ఒకే రోజు మూడు సినిమాలు రిలీజ్ చేయడం సాధ్యమేనా?