హీరో హీరోయిన్లకు షూటింగ్ సందర్భంగా చిన్న చిన్న విభేదాలు తలెత్తడం మామూలే. కానీ అలాంటి విషయాల్ని తర్వాత మరిచిపోతుంటారు. అలాగే ఆ విషయాల గురించి బయట మాట్లాడటానికి పెద్దగా ఇష్టపడరు. కానీ యువ కథానాయకుడు నాగశౌర్య మాత్రం సాయిపల్లవి గురించి చాలా నెగెటివ్ గా మాట్లాడేశాడు ఒక కార్యక్రమంలో. వీళ్లిద్దరూ కలిసి ‘కణం’ సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఐతే కొన్ని రోజుల కిందట ఓ కార్యక్రమంలో భాగంగా సాయిపల్లవి ఇరిటేట్ చేసే నటి అని.. సెట్లో తన డామినేషన్ ఎక్కువగా ఉంటుందని.. సినిమాలో తన ముందు వేరే పాత్రలేవీ పోకస్ కావడానికి ఇష్టపడదని సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీనిపై ఇంతకుముందే ఒకసారి సాయిపల్లవి రియాక్టయింది.
తాజాగా శౌర్యతో విభేదాల గురించి సాయిపల్లవి మరోసారి స్పందించింది. నాగశౌర్య తన గురించి అలా చెప్పిన వీడియో చూసి షాకయ్యానని.. వెంటనే అతడికి ఫోన్ చేశానని.. కానీ అతను అందుబాటులోకి రాలేదని సాయిపల్లవి తెలిపింది. శౌర్య చాలా మంచి నటుడని.. చాలా కామ్ గా ఉంటాడని చెప్పిన సాయిపల్లవి.. తన గురించి అలా ఎందుకు మాట్లాడాడో అర్థం కాలేదని చెప్పింది. తనకు పని తప్ప వేరే ధ్యాస ఉండదని.. తన పాత్ర గురించి దర్శకుడితో ఒకటికి పదిసార్లు చర్చిస్తానని.. అది శౌర్యను ఇబ్బంది పెట్టి ఉండొచ్చని ఆమె అంది. తనకు శౌర్యతోనే కాదు.. ఎవరితోనూ గొడవలు లేవని ఆమె స్పష్టం చేసింది. ఈ సంగతలా ఉంచితే.. పలుమార్లు వాయిదా పడిన ‘కణం’ వచ్చే శుక్రవారం.. అంటే ఏప్రిల్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.