సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన `సర్కారు వారి పాట` ఫలితంతో ఫ్యాన్స్ కొంత నిరుత్సాహానికి గురయ్యారు. భారీగా ఎక్స్ పెక్ట్ చేస్తే ఆశించిన ఫలితాన్ని అంతించలేక తీవ్రంగా నిరాశకు గురిచేసింది. దీంతో ఫ్యాన్స్ దృష్టి మొత్తం ఇప్పడు త్రివిక్రమ్ తో మహేష్ బాబు చేస్తున్న #SSMB28 వైపు మళ్లింది. ఈ మూవీతో ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ ని మహేష్ సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు. పుష్కర కాలం తరువాత మహేష్, త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో వస్తున్న మూవీ ఇది.
గత రెండు నెలల క్రితం పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ మూవీ ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా? అని అభిమానులు ఆశగా ఎదురుచూశారు. ఎట్టకేలకు సెప్టెంబర్ 12న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ని లాంఛనంగా అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రారంభించారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రాజెక్ట్ డిజైనర్ ఏ.ఎస్. ప్రకాష్ ప్రత్యేకంగా వేసిన భారీ సెట్ లో జరుగుతోంది.
ఈ షెడ్యూల్ ని నెల రోజుల పాటు జరపనున్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ పై ఆసక్తికరమైన అప్ డేట్ లు వస్తున్నాయి. ఈ మూవీలోని కీలక పాత్రలో రాజమాత శివగామి రమ్యకృష్ణ నటించనుందని, ఇందులో తన పాత్ర మహేష్ కు అత్తగా వుంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. గత కొంత కాలంగా సీనియర్ హీరోయిన్ లని తన సినిమాల్లోని కీలక పాత్రల్లో చూపిస్తున్న త్రివిక్రమ్ .. #SSMB28 కోసం కూడా అలాంటి ప్రయత్నమే చేస్తున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
ఇదిలా వుంటే 12 ఏళ్ల విరామం తరువాత కలిసి మహేష్ తో చేస్తున్న సినిమా కాబట్టి ప్రతీ విషయంలోనూ ప్రత్యేకంగా వుండాలని త్రివిక్రమ్ ముందు నుంచి ప్లాన్ చేస్తున్నాడట. ఇందులో భాగంగానే ఈ సినిమా కోసం క్రేజీగా ప్లాన్ చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. పాన్ ఇండియా వైడ్ గా ఈ మూవీని రిలీజ్ చేయాలని, అందుకు అనుగునంగా ప్లాన్ లు చేస్తున్నాడట.
ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ కోసం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ విలన్ సైఫ్ అలీఖాన్ ని రంగంలోకి దింపాలని భావిస్తున్నాడట. ప్రభాస్ నటిస్తున్న `ఆది పురుష్`లో సైఫ్ అలీఖాన్ రావణాసురుడిగా విలన్ పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. #SSMB28 లోని విలన్ పాత్ర పవర్ ఫుల్ పాత్ర కావడం, దానికి సైఫ్ అయితేనే పాన్ ఇండియా వైడ్ గా బాగుంటుందని త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడట. మరి త్రివిక్రమ్ ప్లాన్ ప్రకారం సైఫ్ ఓకే అంటే ఈ ప్రాజెక్ట్ కు బాలీవుడ్ లో భారీ క్రేజ్ లభించడం ఖాయం అని తెలుస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.