మరాఠి సినిమా ప్రపంచం చాలా చిన్నది. మొన్ననే అక్కడ ఏప్రియల్ 29న 4 కోట్ల షుమారు బడ్జెట్ తో తీసిన ''సైరత్'' అనే సినిమా విడుదలైంది. మాంచి ప్రేమ కథగా ట్రైలర్ ద్వారా ప్రాచుర్యం పొందింది కాబట్టి.. సినిమాకు ఒక 10 కోట్లు వసూలు చేస్తుందేమో అనుకున్నారు. కాని ఇప్పటికే 50 కోట్ల గ్రాస్ ను సినిమా వసూలు చేసి రికార్డులు సృష్టించింది. అసలు మరాఠి సినిమాలకు అంత వైడ్ రేంజ్ ఉందని ఈ సినిమా ప్రూవ్ చేసింది.
ఇక సినిమా కథ విషయానికొస్తే.. చేపలు పట్టుకొనే ఓ ఫ్యామిలీకి చెందిన కుర్రాడు.. ఆ గ్రామంలో ఒక పెద్ద పొలిటీషియన్ కూతురిని ప్రేమిస్తాడు. ఇద్దరూ ప్రేమించుకుంటారు. చివరకు యాజూజువల్ పెద్ద కుటుంబం వారు.. కులం పేరుతో అంతరాలు చెబుతూ.. ఈ ఫ్యామిలీకి వార్నింగ్ ఇస్తారు. చివరకు ప్రేమికులిద్దరూ లేచిపోయి.. బ్రతుకుతెరువు కోసం హైదరాబాద్ వస్తారు. ఇక్కడ కొన్ని ఇబ్బందులకు గురై.. అన్నీ సెట్టయ్యాక.. మళ్ళీ విలేజ్ కు వెళతారు. అక్కడో ట్విస్టు. నాగరాజ్ మంజులే తీసిన ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా ఆకాష్ తోసర్.. రింకూ రాజ్ గురు నటించారు. అమ్మాయి రింకూకు స్పెషల్ జ్యూరి నేషనల్ అవార్డు కూడా వచ్చింది.
అయితే మన దగ్గర వచ్చిన ప్రేమిస్తే.. గుండెల్లో గోదారి సినిమాలు కూడా అచ్చం ఇలాంటి కథలే. కాకపోతే ఈ సినిమా కాస్త స్లో గానే ఉంటుంది. కాకపోతే హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ కాస్త ఉంది కాబట్టి.. ఈ సినిమాను ఇక్కడ రీమేక్ చేయడం కాని.. లేదంటే డబ్బింగ్ చేసి రిలీజ్ చేద్దామని కాని ఆలోచిస్తున్నారు మరాఠి నిర్మాతలు. కాకపోతే ఇలాంటి కథలు మనోళ్ళకు ఎంతవరకు ఎక్కుతాయి అన్నదే ప్రశ్న.