సాక్ష్యంకు అంత బిజినెస్ జరిగిందా?

Update: 2018-07-11 04:20 GMT
తండ్రి బెల్లంకొండ సురేష్ బ్యాకప్ వల్ల కావచ్చు.. అదృష్టం కలిసి రావడం వల్ల కావచ్చు.. కెరీర్ ఆరంభం నుంచి పెద్ద పెద్ద దర్శకులతో భారీ బడ్జెట్ సినిమాలే చేస్తున్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. హీరోగా పెద్దగా ఇమేజ్ లేకపోయినా అతడి సినిమాలకు బజ్ కూడా బాగానే క్రియేటవుతోంది. శ్రీనివాస్ కొత్త సినిమా ‘సాక్ష్యం’కు కూడా హైప్ బాగానే కనిపిస్తోంది. ఇటీవలే విడుదలైన ట్రైలర్.. ఆడియోలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నెల 27న పెద్ద స్థాయిలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రానికి రూ.40 కోట్ల దాకా బిజినెస్ జరిగినట్లు వార్తలు వస్తుండటం విశేషం. శ్రీనివాస్ మార్కెట్ స్థాయికి అది చాలా పెద్ద మొత్తమే. మరి ఇది నిజమా.. ఎగ్జాజరేషనా అన్నది చూడాలి.

నైజాం టాప్ డిస్ట్రిబ్యూటర్లలో ఒకడైన అభిషేక్ నామా.. నిర్మాతగా మారి తీసిన సినిమాల్లో ఇదొకటి. దిల్ రాజు లాంటి అగ్ర నిర్మాత ఈ చిత్ర నైజాం హక్కుల్ని సొంతం చేసుకున్నాడట. ఆయన రూ.7 కోట్లకు హక్కులు కొన్నట్లు చెబుతున్నారు. రవితేజ స్థాయి హీరోలకు సైతం నైజాంలో ఈ రేటు పలకదు. మరి శ్రీనివాస్ సినిమాను.. అది కూడా ఆచితూచి సినిమాలు ఎంచుకునే దిల్ రాజు ఈ రేటుకు సినిమాను కొన్నారంటే ఆశ్చర్యమే. మరి సినిమా రషెస్ చూసి నమ్మకంతో ఆయన ఈ రేటు పెట్టారా.. లేక సినిమాకు హైప్ తేవడానికి చిత్ర బృందమే ఈ వార్తను ప్రచారం చేస్తోందా అన్నది డౌట్. మిగతా ఏరియాలకు కూడా ఇదే తరహాలో రేట్లు వినిపిస్తున్నాయి. చూద్దాం మరి ఈ వార్తల్లో నిజమెంతో. ‘లక్ష్యం’, ‘లౌక్యం’ లాంటి సినిమాలు తీసిన శ్రీవాస్ ఈ చిత్రానికి దర్శకుడు. పూజా హెగ్డే కథానాయిక.
Tags:    

Similar News