బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ మూవీ సాక్ష్యం. శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. సూపర్ న్యాచురల్ పవర్ థీమ్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం.. విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ కూడా ఎక్కువగానే జరుగుతోంది.
గ్రాఫిక్స్ వర్క్ డిలే కావడంతో రిలీజ్ డేట్ విషయంలో సందిగ్ధత నెలకొంది. ముందుగా అనుకున్న సమయం కంటే ఎక్కువ సమయం పడుతుండడంతో.. జూన్ 14న విడుదల కావడం సందేహమే అనే టాక్ వినిపించింది. ఇప్పుడీ టాక్ ను నిజం చేస్తూ.. జూలై 20న సాక్ష్యంను విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇందుకు కారణం సీజీ వర్క్ ఆలస్యం కావడమే అని చెప్పారు. కొత్తగా ప్రకటించిన తేదీ కల్లా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు.. పలు గ్రాఫిక్స్ కంపెనీలు అహర్నిశలు కష్టపడుతున్నాయి. బాహుబలికి విజువల్ ఎఫెక్ట్స్ ను రూపొందించిన మకుట సంస్థతో పాటు.. ముంబైకు చెందిన మరో నాలుగు కంపెనీలు కూడా ప్రస్తుతం ఇదే పనిలో ఉన్నాయి.
పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో.. ఐదు అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్ లు ఉంటాయని.. దేనికదే క్లైమాక్స్ రేంజ్ లో ఉంటుందని ఇప్పటికే చెప్పారు. పీటర్ హెయిన్స్ యాక్షన్ కొరియోగ్రఫీ అందించగా.. జూలై మొదటి వారంలో ఆడియో రిలీజ్ కోసం ప్లానింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. జూన్ మూడో వారం నుంచి ప్రమోషన్స్ ను టాప్ గేర్ లో చేయనున్నారట.