బెల్లంకొండ బిజినెస్ బాగుంది!

Update: 2018-07-26 05:48 GMT
బెల్లంకొండ సాయిశ్రీనివాస్ క‌థానాయ‌కుడిగా న‌టించిన ఏ సినిమా కూడా ఇప్ప‌టిదాకా 25 కోట్ల షేర్ తీసుకురాలేదు. తొలి చిత్రం అల్లుడు శీనుకి మాత్రం 24.30 కోట్ల షేర్ వ‌చ్చింది. కానీ  ఒక కొత్త క‌థానాయ‌కుడి సినిమాకి ఆ రేంజిలో వ‌సూళ్లు రావ‌డం గొప్ప విష‌య‌మే. వినాయ‌క్ ఆ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించడం కూడా క‌లిసొచ్చింది. అయితే బెల్లంకొండ శ్రీనివాస్ ఆ మార్కెట్‌ ని అలా నిల‌బెట్టుకొనే ప్ర‌య‌త్నం గ‌ట్టిగా చేస్తున్నాడు. ఆ విష‌యంలో విజ‌య‌వంత‌మ‌య్యాడు కూడా. ప్ర‌తి సినిమానీ చాలా గ్రాండియ‌ర్‌ గా తీస్తూ... అందుకు త‌గ్గ‌ట్టుగానే ప్ర‌మోట్ చేసుకొంటూ సినిమాల‌కి మంచి హైప్ తీసుకురావ‌డంలో విజ‌య‌వంత‌మ‌వుతున్నాడు బెల్లంకొండ‌. ఈ విష‌యంలో ఆయ‌న తండ్రి బెల్లంకొండ సురేష్ పాత్ర ఉంద‌న్న‌ది సుస్ప‌ష్టం. స్వ‌త‌హాగా నిర్మాత అయిన బెల్లంకొండ సురేష్ త‌న దృష్టి మొత్తం కొడుకు సినిమాల‌పైనే పెడుతున్నాడు. అన్నీ తానై వ్య‌వ‌హ‌రిస్తూ ప్ర‌తి సినిమాకీ మార్కెట్‌ ని పెంచే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. ఈ  శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొస్తున్న `సాక్ష్యం` కూడా మంచి బిజినెస్సే చేసుకుంది. ఇండియా వైడ్ థియేట్రిక‌ల్ బిజినెస్సే ఖ‌ర్చుల‌తో క‌లిపి  25.20కోట్లుగా లెక్క తేలింది. శాటిలైట్‌ - డిజిట‌ల్‌ - ఓవ‌ర్సీస్ హ‌క్కుల‌కి సంబంధించిన బిజినెస్సు వేరే. మొత్తంగా చూస్తే బెల్లంకొండ సాయిశ్రీనివాస్ సాక్ష్యం విడుద‌ల‌కి ముందు బిజినెస్ ప‌రంగా సూప‌ర్ హిట్ట‌యిన‌ట్టే. మ‌రి  విడుద‌ల త‌ర్వాత ఏ రేంజిలో బిజినెస్ చేస్తుంద‌న్న‌ది చూడాలి.

ఏరియావైజ్‌గా హ‌క్కులు ఇలా అమ్ముడుపోయాయి

నైజామ్ 7 కోట్లు అడ్వాన్స్‌
సీడెడ్ 4.50 కోట్లు ఎన్‌.ఆర్‌.ఎ
ఉత్త‌మ‌రాంధ్ర 2.50 కోట్లు ఎన్‌.ఆర్‌.ఎ
ఈస్ట్ 1.80 కోట్లు ఎన్‌.ఆర్‌.ఎ
గుంటూరు 2 కోట్లు ఎన్‌.ఆర్‌.ఎ
కృష్ణ 1.80 కోట్లు అడ్వాన్స్
వెస్ట్ 1.60 కోట్లు ఎన్‌.ఆర్‌.ఎ
నెల్లూరు 1 కోటి  ఎన్‌.ఆర్‌.ఎ
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ - తెలంగాణ క‌లిపి  22.20 కోట్లు
క‌ర్ణాట‌క + త‌మిళ‌నాడు + నార్త్ ఇండియా 1.50 కోట్లు ఔట్‌రేట్‌
ఆల్ ఇండియా 23.70 కోట్లు
ఆల్ ఇండియా రైట్స్ ఇన్‌ క్లూడ్ ఎక్స్‌ పెన్సెస్ 25.20 కోట్లు
Tags:    

Similar News