భారతదేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మక IIFA అవార్డ్స్ -2022 వేడుకలు అబుదాబిలో జరుగుతున్న సంగతి తెలిసిందే. జూన్ 2 న మొదలైన ఈ ఉత్సవాలు ఈ శనివారం (జూన్ 4)తో ముగియనున్నాయి. 3 రోజుల పాటు ఈ ఉత్సవాలు హుషారుగా సాగుతున్నాయి. అన్ని సినీపరిశ్రమల నుంచి చాలా మంది ప్రముఖులు ఇప్పటికే అబుదబీ వేదికకు చేరుకున్నారు. ఈరోజు సల్మాన్ ఖాన్- రితీష్ దేశ్ముఖ్- మనీష్ పాల్- షాహిద్ కపూర్- టైగర్ ష్రాఫ్- అనన్య పాండే బాలీవుడ్ నుంచి అటెండయ్యారు. బాలీవుడ్ స్టార్లతో పాటు ఇతర సినీపరిశ్రమల నుంచి ప్రముఖులు పాల్గొనగా విలేకరుల సమావేశం జరిగింది. ఈ కాన్ఫరెన్స్ వీడియో క్లిప్ కూడా విడుదలైంది. ఇందులో సల్మాన్ వర్సెస్ రితేష్ దేశ్ ముఖ్ మధ్య చిన్నపాటి కలతలు అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారాయి.
సల్మాన్ భాయ్ ఈ కాన్ఫరెన్సులో రితీష్ హోస్టింగుతో కొంత కలత చెందాడు. దానికి హోస్ట్ మనీష్ లింక్ కూడా చర్చనీయాంశమైంది. సల్మాన్ అంతటి వాడు ఉన్న వేదికపై మనీష్ హోస్టింగ్ నైపుణ్యాలను ఒక రేంజులో రితేష్ ప్రశంసించాడు. కానీ సల్మాన్ భాయ్ ప్రస్థావన అయినా తేకుండా మాట్లాడడం హర్ట్ చేసిందట. రితీష్ మాట్లాడుతూ హోస్టింగ్ లో మనీష్ అనుభవం గురించి అతడు ఎంత గొప్పవాడో పొగిడేశాడు. అయితే అదే వేదికపై ఉన్న సల్మాన్ గురించి పట్టించుకోలేదు. దీంతో తాను కలత చెందానని భాయ్ చెప్పాడు. రితీష్ తన హోస్టింగ్ స్కిల్స్ గురించి ఏమీ చెప్పకపోవడంతో తీవ్రంగా బాధపడ్డాడని తెలుస్తోంది.
సల్మాన్ చాలా ఏళ్ల నుంచి బిగ్ బాస్ కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. దీంతో రితీష్ సల్మాన్ దగ్గరకు వెళ్లి సారీ చెప్పాడు. జూన్ 4న జరిగే ప్రధాన ఈవెంట్ కి సల్మాన్ ఖాన్- రితీష్ దేశ్ముఖ్ - మనీష్ పాల్ లు సంయుక్తంగా హోస్టింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. భాయ్ తో రితేష్ కాంబినేషన్ ని చూడటం చాలా సరదాగా ఉంటుంది. ఎన్నో వేదికలపై ఆ ఇద్దరి మధ్యా హాస్యచతురత పెద్దగా వర్కవుటైంది.
Full View

సల్మాన్ భాయ్ కి జెనీలియా ఎంతో సన్నిహితురాలు. రితేష్ తో చాలా కాలంగా భాయ్ కి స్నేహం ఉంది. అందువల్ల తన హోస్టింగ్ స్కిల్స్ గురించి పబ్లిక్ వేదికపై చెప్పకపోయినా కానీ భాయ్ మరీ అంత సీరియస్ గా తీసుకోలేదు. కాస్తంత బాధపడినా ఆ తర్వాత లైట్ తీస్కున్నారట. అలాగే ఒక హీరో అయినా కానీ రితేష్ ఎలాంటి భేషజానికి పోకుండా సల్మాన్ భాయ్ కి సారీ చెప్పాడు. రితేష్ ప్రస్తుతం బాలీవుడ తో పాటు మరాఠా సినిమాల్లోనూ నటిస్తున్నాడు. సల్మాన్ భాయ్ కెరీర్ పరంగా ఫుల్ స్వింగులో ఉన్నాడు. అతడు నటిస్తున్న కబీ ఈద్ కబీ దీవాళి చిత్రం డిసెంబర్ లో విడుదల కానుంది.