ఒకే క‌ప్పులో కాఫీ సిప్ చేసిన స‌ల్మాన్.. క‌త్రినా!

Update: 2018-03-26 09:55 GMT
కొన్ని రిలేష‌న్స్ అంద‌రి దృష్టిని విప‌రీతంగా ఆక‌ర్షిస్తుంటాయి. బాలీవుడ్ ల‌వ్ పెయిర్ల‌లో స‌ల్మాన్.. క‌త్రినా ఎపిసోడ్‌ ను ప్ర‌త్యేకంగా చెబుతారు. వీరి ల‌వ్ ఎపిసోడ్ మ‌ధ్య‌లోనే క‌టీఫ్ అయిపోయినా.. వీరిద్ద‌రు క‌లిసిన ప్ర‌తి సంద‌ర్భంలోనూ అంద‌రి క‌ళ్లు వీరి మీద‌నే ఉంటాయి.

చాలాకాలం సాగిన వారి ప్రేమానుబంధాన్ని ఇద్ద‌రూ మ‌ర్చిపోరేమోన‌న్న‌ట్లుగా వారిద్ద‌రూ వ్య‌వ‌హ‌రిస్తుంటారు. క‌లిసిన‌ప్పుడు వారి మ‌ధ్య‌ అన్యోన్యం కొట్టొచ్చిన‌ట్లు క‌నిపిస్తుంది. తాజాగా ద‌-బాంగ్ సినిమా కోసం ప్ర‌త్యేకంగా టూర్ చేస్తున్నారు స‌ల్మాన్.. క‌త్రినా.. సోనాక్షిలు. ఇందులో భాగంగా పుణెలో ఒక ప్రెస్ మీట్ పెట్టారు. స‌ల్మాన్.. క‌త్రినాలు ప‌క్క‌ప‌క్క‌నే కూర్చున్నారు.

సీరియ‌స్ గా ప్రెస్ మీట్ సాగుతున్న వేళ‌.. స‌ల్మాన్ కప్పులో కాఫీ సిప్ చేసి.. టేబుల్ మీద పెడితే.. క‌త్రినా దాన్ని తీసుకొని మ‌రో సిప్ వేసి టేబుల్ మీద పెట్టింది. అనంత‌రం మ‌ళ్లీ మ‌రో సిప్ వేశారు స‌ల్మాన్‌.  ఇదంతా చూస్తున్న వారు  త‌మ కెమేరాల‌తో బంధించ‌ట‌మే కాదు.. దాన్ని సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. మాజీ ప్రేమికుల అన్యోన్య‌త‌ను చాటి చెప్పే ఈ ఉదంతం ఆస‌క్తిక‌రంగా మార‌ట‌మే కాదు.. ఇప్పుడ‌ది వైర‌ల్ గా మారింది.


వీడియో కోసం క్లిక్ చేయండి

Full View
Tags:    

Similar News