ఫ్లాష్‌: భాయ్ ని చంపేస్తామ‌ని మ‌రో వార్నింగ్!

Update: 2019-09-25 07:08 GMT
బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ కు చంపేస్తామంటూ వార్నింగ్ అందింది. మ‌రోవైపు వేరొక ర‌కంగా ఘోర అవ‌మానం జ‌రిగింది. ఈ రెండిటి వివ‌రాల్లోకి వెళితే ..

స‌ల్మాన్ కి ఓ స్టూడెంట్ ఆర్గ‌నైజేష‌న్ నుంచి చంపేస్తామంటూ వార్నింగ్ అందింది. ఆ మేర‌కు ఫేస్ బుక్ పోస్టింగ్ క‌ల‌క‌లం రేప‌డంతో ప్ర‌స్తుతం ఈ ఉదంతంపై పోలీస్ విచార‌ణ సాగుతోంది. స‌ల్మాన్ బాగా ఆలోచించు. నువ్వు చ‌ట్టం నుంచి త‌ప్పించుకోలేవు. వైష్ణోయ్ స‌మాజ్ - సోపు పార్టీ నుంచి ఇప్ప‌టికే చ‌స్తావ‌ని వార్నింగ్ అందింది. నువ్వు సోపు కోర్టులో అప‌రాధివి`` అన్న వ్యాఖ్య ఎఫ్‌బీలో క‌నిపించ‌డంతో క‌ల‌క‌లం చెల‌రేగింది. ఇక ఈ కేసు విష‌య‌మై వేరొక అవ‌మానం ఈ సంద‌ర్భంగా బ‌య‌ట‌ప‌డింది.

1998లో `హామ్ సాత్ సాత్ హై` చిత్రం కోసం రాజ‌స్థాన్ లో షూటింగ్ జ‌రుగుతుండ‌గా స‌ల్మాన్ ఖాన్ ఆట‌విడుపు కోసం అని అడ‌వికి వెళ్లి కృష్ణ జింక‌ల్ని వేటాడి చంపిన స్టోరీ తెలిసిందే. రాజ‌స్థాన్ ప్ర‌భుత్వం స‌ల్మాన్ పై ఛార్జీషీట్ న‌మోదు చేయ‌డంతో అప్ప‌ట్లో కృష్ణ జింక‌ల వేట.. వ‌న్య ప్రాణి సంర‌క్ష‌ణ చ‌ట్టం.. ఐదేళ్ల జైలు విక్ష‌ వంటి ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశం అయ్యాయి. అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు స‌ల్మాన్ ఆ కేసు నిమిత్తం రాజ‌స్థాన్ కోర్టుల చుట్టూ తిరుగుతూనే వున్నాడు.

ఇటీవ‌ల అత‌డికి కాస్త ఊర‌ట ల‌భించింది. అయితే తాజాగా రాజ‌స్థాన్ కోర్టు స‌ల్మాన్ ని ఈ నెల 27న మ‌రోసారి కోర్టులో హాజ‌రు కావాల‌ని నోటీసులు పంప‌డంతో మ‌ళ్లీ క‌థ మొద‌టికి వ‌చ్చింది. దీన్ని ఆధారంగా చేసుకున్న రాజ‌స్థాన్ రెడ్ క్రాస్ సంస్థ త‌న ఫేస్ బుక్ పేజీలో స‌ల్మాన్ న‌టించిన `భార‌త్‌` చిత్రంలోని ఓల్డ్‌ ఫొటోని పోస్ట్ చేసి గ్రే షూట‌ర్ అని క్యాప్ష‌న్ ఇవ్వ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. స‌ల్మాన్ తో పాటు కృష్ణ జింక‌ల వేట కేసులో సైఫ్ అలీఖాన్‌-సొనాలి బింద్రే- ట‌బు- నీలం కోఠారి వున్నారు. రెండు కృష్ణ జింక‌ల్ని చంపిన కేసులో వీరు ముద్దాయిలు. గ‌త కొంత కాలంగా కోర్టు ముందు హాజ‌రు కావాల‌ని ఆదేశిస్తున్నా.. స‌ల్మాన్ ఈ మ‌ధ్య కాలంలో హాజ‌రు కాలేక‌పోయాడు.

ఈ కేసులో గ‌త ఏడాది ఏప్రిల్ లో రాజ‌స్థాన్ కోర్టు స‌ల్మాన్ కు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. జోధ్ పూర్ జైలులో రెండు రోజుల క‌ష్ట‌డీ త‌ర‌వాత స‌ల్మాన్ బెయిల్ పై బ‌య‌టికి వ‌చ్చాడు. తాజాగా బెయిల్ గ‌డువు ముగియ‌డంతో మ‌రోసారి కోర్టులో హాజ‌రు కావాల‌ని నోటీసులు జారీ అయ్యాయి. ఈ నేప‌థ్యంలో రాజ‌స్థాన్ కు చెందిన రెడ్ క్రాస్ సంస్థ త‌మ ఫేస్ బుక్ పేజీలో స‌ల్మాన్ ఓల్డ్ గెట‌ప్ లో వున్న ఫొటోని పోస్ట్ చేసి గ్రే షూట‌ర్ అంటూ సెటైరిక‌ల్ గా స‌ల్మాన్ ను అవ‌మానించ‌డం వేడెక్కిస్తోంది.

   

Tags:    

Similar News