సింగిల్ రేటింగ్.. ఎక్కువంటున్న సల్మాన్

Update: 2017-06-24 08:55 GMT
‘ట్యూబ్ లైట్’ సినిమాకు క్రిటిక్స్ నుంచి ఎలాంటి ఫీడ్ బ్యాక్ ఉంటుందో ముందే ఊహించాడో ఏమో సల్మాన్ ఖాన్.. ఈ సినిమా విడుదలకు కొన్ని రోజుల ముందే రివ్యూలు.. రేటింగ్స్ విషయంలో విమర్శలు గుప్పించాడు సల్మాన్. తన సినిమాలకు రివ్యూ ప్రూఫ్ ఉంటుందని.. మైనస్ వంద రేటింగ్ ఇచ్చి చూడమని సమీక్షకులకు సవాలు విసిరాడు సల్మాన్.

ఇప్పుడు ‘ట్యూబ్ లైట్’ సినిమాకు వస్తున్న నెగెటివ్ ఫీడ్ బ్యాక్.. 1-2 మధ్య వస్తున్న రేటింగ్స్ చూస్తుంటే సల్మాన్ ముందస్తు వ్యూహంతోనే ఆ వ్యాఖ్యలు చేశాడని అర్థమైపోతోంది. సినిమా విడుదల తర్వాత కూడా సల్మాన్ సమీక్షకుల మీద విమర్శలు సెటైర్లు ఆపట్లేదు. తన సినిమాకు 1-1.15-2 రేటింగ్స్ రావడంపై స్పందిస్తూ.. సమీక్షకులు చాలా ఉదారంగా వ్యవహరించారని సల్మాన్ అన్నాడు. నిజానికి తాను మైనస్ 3.. మైనస్ 4 రేటింగులు వస్తాయనుకున్నానని.. కానీ 1-1.15 రేటింగ్స్ అస్సలు ఊహించలేదని అన్నాడు సల్మాన్.

ఇక సినిమాకు జనాల నుంచి వస్తున్న ఫీడ్ బ్యాక్ గురించి సల్మాన్ ను అడిగితే.. తాను ఏడవడం నచ్చట్లేదని చాలామంది అంటున్నారని.. కానీ వాళ్లందరూ కూడా సినిమా చూసి ఏడుస్తున్నారని చెప్పాడు. రంజాన్ పండక్కి తన సినిమా అనగానే జనాలు ఒక రకమైన అంచనాలతో థియేటర్లకు వచ్చారని.. కాయిన్స్ విసురుతూ.. విజిల్స్ కొడుతూ.. కోలాహలం చేద్దామనుకున్నారని.. కానీ ‘ట్యూబ్ లైట్’ సెన్సెటివ్ ఫిల్మ్ కావడంతో సైలెంటుగా సినిమా చూడాల్సి వస్తోందని.. అందుకే మిక్స్డ్ రెస్పాన్స్ కనిపిస్తోందని సల్మాన్ అభిప్రాయపడ్డాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News