మలయాళం యువహీరో దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కిన నూతన చిత్రం 'సెల్యూట్'. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ చేసాడు. అయితే తాజాగా సెల్యూట్ సినిమా టీజర్ విడుదల చేశారు మేకర్స్. ఎస్సై అరవింద్ కరుణాకరణ్ పాత్రలో కనిపించనున్నట్లు దుల్కర్ టీజర్ ద్వారా రివీల్ చేసాడు. ఒక నిమిషం పాటు వ్యవధి కలిగిన సెల్యూట్ టీజర్ చూస్తేనే సినిమాలో మేటర్ బాగానే ఉన్నట్లు అర్ధమవుతుంది. ఎందుకంటే మాములుగా పోలీస్ స్టోరీలను సినిమాలుగా తీసేటప్పుడు మేకర్స్ చాలా జాగ్రత్తపడతారు. కాకపోతే టీజర్ లో సినిమా స్టోరీ కొంచం కూడా రివీల్ చేయలేదు మేకర్స్. పోలీస్ వాహనానికి అడ్డుపడిన నిరసనకారులను అడ్డు తొలగించడానికి ఎస్సై అరవింద్ ధైర్యం చేస్తున్నట్లు టీజర్ చూస్తే తెలుస్తుంది.
పోలీస్ వాహనం నుండి బయటికి రావడమే ఓ చేతితో టోపీని పెట్టుకుంటున్నట్లు దుల్కర్ సల్మాన్ స్లో మోషన్ ఎంట్రీ ఇవ్వడం.. అలాగే వాహనం నుండి బయటికి వచ్చాక కూల్ గా బెహేవ్ చేయడం మనం చూడవచ్చు. మంచి బాక్గ్రౌండ్ మ్యూజిక్ తో టీజర్ ను హైలైట్ చేసే ప్రయత్నం చేశారు మేకర్స్. నిజానికి టీజర్ చూస్తే అన్ని పోలీస్ కథలలాగా కాకుండా ఏదో డిఫరెంట్ గా ట్రై చేసారని అనిపిస్తుంది. మరి పోలీస్ అధికారిగా దుల్కర్ ఎవరికీ వ్యతిరేకంగా ఉండబోతున్నాడు.. అనేది తెలియాలంటే ట్రైలర్ వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే. ఈ సినిమాకు రోషన్ ఆండ్రుస్ దర్శకత్వం వహించాడు. దుల్కర్ ఇదివరకు విక్రమాధిత్యాన్ అనే సినిమాలో పోలీస్ రోల్ చేసాడు. అంతేగాక ఈ సెల్యూట్ సినిమాను వేఫేరర్ ఫిలిమ్స్ బ్యానర్ పై స్వయంగా దుల్కర్ నిర్మిస్తుండటం విశేషం. ప్రస్తుతానికి సెల్యూట్ టీజర్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది.Full View
పోలీస్ వాహనం నుండి బయటికి రావడమే ఓ చేతితో టోపీని పెట్టుకుంటున్నట్లు దుల్కర్ సల్మాన్ స్లో మోషన్ ఎంట్రీ ఇవ్వడం.. అలాగే వాహనం నుండి బయటికి వచ్చాక కూల్ గా బెహేవ్ చేయడం మనం చూడవచ్చు. మంచి బాక్గ్రౌండ్ మ్యూజిక్ తో టీజర్ ను హైలైట్ చేసే ప్రయత్నం చేశారు మేకర్స్. నిజానికి టీజర్ చూస్తే అన్ని పోలీస్ కథలలాగా కాకుండా ఏదో డిఫరెంట్ గా ట్రై చేసారని అనిపిస్తుంది. మరి పోలీస్ అధికారిగా దుల్కర్ ఎవరికీ వ్యతిరేకంగా ఉండబోతున్నాడు.. అనేది తెలియాలంటే ట్రైలర్ వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే. ఈ సినిమాకు రోషన్ ఆండ్రుస్ దర్శకత్వం వహించాడు. దుల్కర్ ఇదివరకు విక్రమాధిత్యాన్ అనే సినిమాలో పోలీస్ రోల్ చేసాడు. అంతేగాక ఈ సెల్యూట్ సినిమాను వేఫేరర్ ఫిలిమ్స్ బ్యానర్ పై స్వయంగా దుల్కర్ నిర్మిస్తుండటం విశేషం. ప్రస్తుతానికి సెల్యూట్ టీజర్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది.